తెలంగాణ

telangana

ETV Bharat / international

'మమ్మల్ని గెంటేశారు- వియన్నా ఒప్పందం ఉల్లంఘిస్తున్నారు'- మళ్లీ నోరు పారేసుకున్న ట్రూడో

India Canada News Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో మరోసారి ఖలిస్థానీ ఉగ్రవాది హర్​దీప్​ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వియన్నా ఒప్పందాన్ని న్యూదిల్లీ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

India Canada News Justin Trudeau
India Canada News Justin Trudeau

By PTI

Published : Nov 13, 2023, 7:52 AM IST

India Canada News Justin Trudeau : వియన్నా ఒప్పందాన్ని న్యూదిల్లీ ఉల్లంఘిస్తోందని, కెనడా ప్రధాని ట్రూడో మరోసారి భారత్‌పై ఆరోపణలు చేశారు. తమ దేశం చట్టబద్దపాలన కోసం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. తాజాగా విలేకర్లతో మాట్లాడిన ఆయన.. మరోసారి ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ హత్య కేసులో నిజానిజాలను తేల్చేందుకు భారత్‌, మిత్రదేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. అయితే, భారత్ మాత్రం తమ దౌత్యవేత్తలను గెంటేసిందని వ్యాఖ్యానించారు.

'ఈ సారి మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. లా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వాటి పని అవి చేస్తున్నాయి. మేము మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. కెనడా చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉంటుంది' అని తెలిపారు. ఎటువంటి పరిణామాలు ఎదుర్కోకుండా పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రమాదంలో పడుతుందని ట్రూడో చెప్పుకొచ్చారు.

భారత్​తో కలిసి పనిచేస్తాం..
భారత్‌ వియన్నా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని ట్రూడో ఆరోపించారు. తమ దౌత్యవేత్తలను అన్యాయంగా వెనక్కి పంపిందన్నారు. "ఈ ఘటన నన్ను పూర్తిగా నిరాశపర్చింది. మా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించండి. నిజ్జర్ హత్య కేసులో భారత్​ ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పడానికి మా దగ్గర బలమైన కారణాలున్నాయి. కానీ, దీనికి భారత్ స్పందిస్తూ.. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి.. మా దౌత్యవేత్తలను గెంటేసింది. ఈ విషయం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. మా దౌత్యవేత్తల భద్రతపై ఆందోళన నెలకొంది. కానీ, ప్రతి అడుగులోనూ మేము భారత్​తో సానుకూలంగా కలిసి పనిచేయాలని అనుకున్నాం. భవిష్యత్తులో కూడా భారత్, ఆ దేశ దౌత్యవేత్తలతో కలిసి పనిచేస్తాం. మాది ఎప్పుడు చట్టబద్దపాలన కోసం పనిచేసే దేశం" అని ట్రూడో వెల్లడించారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​.. నిజ్జర్ హత్య కేసులో కెనడాకు సహకరించాలని భారత్​ను కోరిన తర్వాత ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద కార్యకలాపాలపై భారత్​ ఆందోళనను అమెరికాకు స్పష్టంగా తెలిపినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా గతవారమే తెలిపారు. కెనడాతో నెలకొన్న పరిస్థితుల గురించి తమ మిత్ర దేశాలతో మాట్లాడుతూనే ఉన్నామని వినయ్​ క్వాత్రా అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో వారికి పరిస్థితిని వివరించామని చెప్పారు. సెప్టెంబర్​లో ట్రూడో ఆరోపణల తర్వాత కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారతదేశం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక నెల తరువాత తిరిగి ప్రారంభించింది.

'నిజ్జర్​ హత్యపై ఆధారాలివ్వండి- ఉగ్రవాదానికి లైసెన్స్​లా స్వేచ్ఛ మారకూడదు!'

India Canada Visa News : కెనడాలో వీసాల జారీ ప్రారంభం.. కానీ ఓ ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details