పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫోన్‌లో ఓ మహిళతో అసభ్య సంభాషణ జరిపినట్లు లీకైన ఆడియో క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఈ ఆడియో క్లిప్‌లపై పాకిస్థాన్‌లో దుమారం రేగుతుండగా.. ఇమ్రాన్‌ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీక్ అయిన ఆడియో క్లిప్‌ల్లో ఇమ్రాన్ ఖాన్‌గా భావిస్తున్న వ్యక్తి.. ఫోన్‌లో ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లుగా తనను వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంది. మరో క్లిప్‌లో సదరు మహిళ మర్నాడు వస్తానని అంటుంది. ఆ సమయంలో సదరు వ్యక్తి మాట్లాడుతూ ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని.. కుదిరితే వారి రాకను ఆలస్యం చేసేందుకు యత్నిస్తానని చెప్పారు. ఏ విషయం మర్నాడు మళ్లీ ఫోన్ చేసి ధ్రువీకరిస్తానని ఇమ్రాన్‌ఖాన్‌గా భావిస్తున్న వ్యక్తి అన్నట్లు ఆడియో క్లిప్‌లో ఉంది.
ఇమ్రాన్ ఖాన్ 'సెక్స్ కాల్ రికార్డింగ్'తో పాక్‌లో కలకలం.. ఫేక్ అంటున్న పీటీఐ - Imran Khan Latest News
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన మాట్లాడినట్లు ఉన్న అసభ్య సంభాషణకు సంబంధించి.. లీకైన రెండు ఆడియో క్లిప్‌లు వైరల్‌గా మారాయి. అవి బయటకు వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని పేర్కొంది. ఇది ఇమ్రాన్ వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర అని ఆరోపించింది.
రెండు భాగాలుగా ఉన్న ఈ ఆడియో క్లిప్‌లను పాకిస్థాన్ జర్నలిస్టు సయీద్ అలీ హైదరీ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగాక.. ఆయనకు సంబంధించిన పలు ఆడియో క్లిప్‌లు ఇంతకుముందు కూడా లీకయ్యాయి. అందులో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం, మిలిటరీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఇమ్రాన్ ఆరోపించారు. తాజాగా లీక్ అయిన ఆడియో క్లిప్‌లపై ఇమ్రాన్‌కు చెందిన తెహ్రీక్- ఇ-ఇన్సాఫ్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అవన్నీ నకిలీ ఆడియో క్లిప్‌లని పేర్కొంది. ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిత్వాన్ని చంపే కుట్రగా ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ గురించి పాక్ ప్రభుత్వం.. నకిలీ ఆడియో, వీడియో క్లిప్‌లతో తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ ప్రత్యర్థులు అంతకుమించి ఆలోచించలేరని పీటీఐ ఎద్దేవా చేసింది.