Imran Khan resign: ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇస్లామాబాద్‌లో ఆదివారం జరిగే ర్యాలీలోనే రాజీనామా ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విదేశీ నిధుల కేసులో సోమవారం ఇమ్రాన్‌ను అరెస్టు చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీలోనే ఇమ్రాన్.. ముందస్తు ఎన్నికల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆదివారమే పాక్ ప్రధాని ఇమ్రాన్ రాజీనామా? - ఇమ్రాన్ రాజీనామా
Imran Khan resign: సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామాకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇస్లామాబాద్‌లో ఆదివారం జరిగే ర్యాలీలోనే రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇమ్రాన్ ప్రభుత్వంపై సైన్యం విశ్వాసం కోల్పోయినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా సైన్యంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేయటంతో పాటు 2019లో ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై తాత్సారం చేయటం వల్ల పాక్ సైన్యం ఇమ్రాన్‌పై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఈనెల 8న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వందమంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ అంశంపై చర్చ ఈ నెల 28కి వాయిదా పడింది. సొంత పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సలహా: వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించినట్లు శనివారం తెలిపారు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషిద్. ఆయనపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇమ్రాన్ పరపతి పెరిగిందన్నారు. అయితే, 2022-23 ఫెడరల్ బడ్జెట్ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. దీనిని అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వైఖరిగా తీసుకోవద్దని సూచించారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు ఎన్నికలకు వెళ్లటమే సరైనదని పేర్కొనటం ఇది రెండోసారి.