తెలంగాణ

telangana

ETV Bharat / international

'నన్ను చంపేందుకు ప్రధాని కుట్ర.. హత్య ప్లాన్ గురించి ముందే తెలుసు' - ఇమ్రాన్ ఖాన్ హత్య

తనను చంపేందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుట్రపన్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. హత్య ప్లాన్ గురించి తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

Imran Khan assassination plot
Imran Khan assassination plot

By

Published : Nov 4, 2022, 10:30 PM IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం తర్వాత తొలిసారి దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాహోర్‌లోని ఆస్పత్రిలో వీల్‌ఛైర్‌ మీద నుంచే ఆయన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై దాడి జరుగబోతున్నట్లు ఒక రోజు ముందే తెలిసిందని తెలిపిన ఇమ్రాన్‌ వజీరాబాద్‌ లేదా గుజ్రాత్‌లో హత్య జరిగేలా ప్రణాళికలు రచించినట్లు వివరించారు. హత్య కుట్ర వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ కలిసి తనపై హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు.

తన కాలికి నాలుగు బుల్లెట్లు తగిలాయని వెల్లడించిన ఇమ్రాన్.. పంజాబ్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ను చంపినట్లే తన హత్యకు కుట్ర జరిగినట్లు తెలిపారు. తాను సామాన్య ప్రజల నుంచి వచ్చానన్న ఆయన తన పార్టీ మిలిటరీ స్థాపన కింద పని చేయదని స్పష్టం చేశారు. తన దగ్గర అతిముఖ్యమైన వీడియో ఒకటి ఉందనీ... తనకు ఏదైనా జరిగితే అది బయటకు విడుదల చేసేలా ఏర్పాట్లు చేశానని అన్నారు. అనంతరం ఖాన్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ ఫైజల్‌ సుల్తాన్‌ మాట్లాడుతూ ఇమ్రాన్‌ఖాన్‌ కుడి కాలి టిబియా భాగం దెబ్బతిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details