తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత వ్యతిరేకికి రిపబ్లికన్లు షాక్.. కీలక కమిటీ నుంచి ఇల్హాన్‌ తొలగింపు - ilhan omar Ilhan removed

అమెరికా ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది అగ్రరాజ్యం. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఆమెకు అధికారంలో ఉన్న రిపబ్లికన్లు పదవి నుంచి తొలగించి షాకిచ్చారు. వివాదస్పద వ్యాఖ్యల కారణంగా ఆమెను తొలగించినట్లు తెలుస్తోంది.

ilhan-omar-removed-from-us-foreign-affairs-committee
Etv అమెరికా ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ మెంబర్​ ఇల్హాన్‌ ఒమర్‌

By

Published : Feb 4, 2023, 6:43 AM IST

అమెరికా ప్రతినిధులసభలో డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌కు రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తిమంతమైన విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించారు. 2019లో ఇజ్రాయెల్‌, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను చూస్తే ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీలో ఉండటానికి ఆమె అర్హురాలు కాదని రిపబ్లికన్‌ సభ్యులు వాదించారు. ఈ మేరకు జరిగిన ఓటింగ్‌లో ఇల్హాన్‌కు వ్యతిరేకంగా 218, అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి.

ఇల్హాన్‌ను తొలగించడాన్ని డెమొక్రటిక్‌ పార్టీ తప్పుపట్టింది. రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది. గతేడాది ఏప్రిల్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఆమె కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధపెట్టాలన్నారు. అంతేకాకుండా ఇమ్రాన్‌తో ఆమె భేటీ కావడాన్ని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. భారత్‌ ప్రాదేశిక సమగ్రతను ఇల్హాన్‌ ఒమర్‌ ఉల్లంఘించారని విదేశాంగ శాఖ అభ్యంతరం చెప్పింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అమెరికా ఇల్హాన్‌ తన వ్యక్తిగత హోదాలోపాకిస్థాన్‌లో పర్యటించినట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details