తెలంగాణ

telangana

ETV Bharat / international

'విలియంకు నేనొక 'స్పేర్‌' పార్ట్‌'.. ఆత్మకథలో హ్యారీ సంచలన వ్యాఖ్య.. - హ్యారీ విల్లీ బ్రిటన్​ రాజు

ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర సంచలనంగా మారింది. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అవమానాలను అందులో పొందుపరిచారు. తనను ఎప్పుడూ అదనంగానే భావించడం వల్ల పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదని హ్యారీ తన ఆత్మకథలో రాశారు. మరోవైపు, హ్యారీ స్వీయ జీవిత చరిత్ర పుస్తకానికి యూకేలో భారీ డిమాండ్‌ ఏర్పడింది.

willy
willy

By

Published : Jan 12, 2023, 7:17 AM IST

Updated : Jan 12, 2023, 7:31 AM IST

బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ప్రిన్స్ హ్యారీ 'స్పేర్' పేరిట స్వీయ జీవిత చరిత్రను రాశారు. ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ పుస్తకం బ్రిటన్‌లో రికార్డు అమ్మకాలు నమోదుచేస్తోంది. ఈ సందర్భంగా హ్యారీ చిన్నతనం, తన సోదరుడితో ఉన్న బంధం గురించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
'విల్లీ నా కంటే రెండేళ్లు పెద్దవాడు. విల్లీ సింహాసనానికి వారసుడు. నేను స్పేర్‌(అదనం). నేను అతడి నీడను. ప్లాన్‌ ఏ పనిచేయనప్పుడు నన్ను ప్లాన్‌ బిగా వాడతారు. విల్లీకి ఏదైనా జరగరానిది జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చారు' అని వెల్లడించారు.

'నా తండ్రి కింగ్ చార్లెస్‌-3, నా సోదరుడు విలియం ఎన్నడూ ఒకే విమానంలో ప్రయాణించరు. దాంతో సింహాసనం అధిష్టించేందుకు తర్వాత వరుసలో ఉన్న వారికి ఎలాంటి అనూహ్య ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. నా విషయంలో ఎప్పుడూ అలాంటి జాగ్రత్త ఉండదు. నన్నెప్పుడు అదనం(Spare)గానే భావించడం వల్ల పెద్దగా ప్రాధన్యం ఉండేది కాదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నా తండ్రి చెప్పిన మాటల గురించి ఎవరో అంటుంటే విన్నాను. అవి నేను పుట్టినప్పుడు అమ్మతో నాన్న చెప్పిన మాటలు. 'అద్భుతం.. నువ్వు నాకు వారసుడు, స్పేర్‌(Spare)ని ఇచ్చావు. నేను నా పని పూర్తి చేశాను' అని ఆ మాటల సారాంశం" అని హ్యారీ రాసుకొచ్చారు.

'స్పేర్' పేరుతో ప్రిన్స్‌ హ్యారీ రాసిన ఆత్మకథలో రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను బయటపెట్టారు. తన తండ్రి కింగ్‌ ఛార్లెస్‌, సవతి తల్లి కెమిల్లా, అన్నయ్య ప్రిన్స్‌ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్‌ మెర్కెల్‌ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు.

ప్రిన్స్‌ హ్యారీ పుస్తకానికి భారీ డిమాండ్‌
ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం 'స్పేర్‌'కు యూకేలో భారీ డిమాండ్‌ ఏర్పడింది. విడుదలైన తొలి రోజే ఏకంగా 4 లక్షల కాపీలు విక్రయమయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ఇప్పటివరకూ అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్‌-ఫిక్షన్‌ పుస్తకంగా ఇది సరికొత్త ఘనత సాధించింది. 'స్పేర్‌' పుస్తకం మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. దాన్ని అధికారికంగా విడుదల చేసేందుకు బ్రిటన్‌ వ్యాప్తంగా ఉన్న పుస్తక దుకాణాలు సోమవారం అర్ధరాత్రి తర్వాత 12 గంటలకు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి. అప్పటి నుంచే దీనికోసం అభిమానులు పుస్తక దకాణాల వద్ద బారులు తీరారు. హార్డ్‌కాపీతో పాటు ఈ-బుక్‌, ఆడియో ఫార్మాట్‌లలో ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది. దీని వాస్తవ ధర రూ. 2,774 (28 పౌండ్లు) ఉండగా.. మొదటి రోజు చాలా దుకాణాలు సగం ధరకే విక్రయించాయి. సాధారణంగా బ్రిటన్‌లో హ్యారీ పోటర్‌ లాంటి ఫిక్షనల్‌ పుస్తకానికి తొలి రోజు భారీ డిమాండ్‌ ఉంటుంది. తొలిసారి ఓ నాన్‌ ఫిక్షనల్‌ బుక్‌కు ఈ స్థాయిలో గిరాకీ లభించిందని విక్రయదారులు చెబుతున్నారు.

Last Updated : Jan 12, 2023, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details