సగటు వయోజన పురుషుని ఊపిరితిత్తులు గరిష్ఠంగా 6 లీటర్ల గాలిని వాటిలో ఉంచుకోగలవని అమెరికన్ లంగ్ అసోషియేషన్ తెలిపింది. అందులో సాధారణంగా పీల్చిన గాలితో పాటు అవసరానికి మించి తీసుకున్నది, సాధారణంగా వదిలిన గాలితో పాటు అవసరానికి మించి బయటకు వదిలినది, ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న దానిని కూడా కలుపుకొని ఈ లెక్కలు వేశారు. ఇలా.. ప్రతి రోజూ ఒక వ్యక్తి 7,570 లీటర్ల వాయువును తీసుకుంటాడని సంఘం అంచనా వేసింది.
మనం తీసుకునే గాలిలో 20శాతం ఆక్సిజన్, వదిలే గాలిలో 15శాతం ఆక్సిజన్ ఉంటుంది. అంటే ప్రతి శ్వాసకు 5 శాతం వాయువు.. కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. ఈ లెక్కన మనిషి ఒక రోజుకు 378 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వినియోగిస్తాడు. మన ఊపిరితిత్తుల నుంచి ఎంత గాలి వెళ్తుందో తెలుసుకోవడానికి ఓ విధానం ఉంది. ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ సంచి తీసుకొని, దానిలోకి గాలి వదలాలి. ప్రతి శ్వాసకు అది ఎంత నిండుతుందో చూడాలి. పూర్తిగా నిండటానికి ఎంత సయమం పడుతుందో లెక్కించడం ద్వారా ఓ అంచనాకు రావొచ్చు.
రోజుకు తీసుకావాల్సిన శ్వాసపై..
- సాధారణంగా రోజుకు ఎన్నిసార్లు ఊపిరి తీసుకోవాలి?
మంచి శ్వాసకోశ వ్యవస్థ ఉన్న ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి.. నిమిషానికి 16 సార్లు గాలి పీల్చుకుంటాడు. అంటే రోజుకు సుమారు 23వేల సార్లు.
- నిమిషానికి 10 సార్లే శ్వాస తీసుకోవడం సమస్యగా భావించాలా?