తెలంగాణ

telangana

ETV Bharat / international

Hamas Targets : హమాస్‌ 'టాప్​ సీక్రెట్స్'​ లీక్​.. చిన్న పిల్లల స్కూళ్లే ఫస్ట్​ టార్గెట్​.. బందీలను చేసి.. - ఇజ్రాయెల్​పై దాడికి హమాస్ పక్కా ప్లాన్

Hamas Targets : ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగి నెత్తుటేరులు పారించిన హమాస్‌ మిలిటెంట్ల లక్ష్యాలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని ప్రాథమిక పాఠశాలలు, యువజన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌లోకి హమాస్‌ ముష్కరులు చొరబడ్డారని తెలిపే పత్రాలు బహిర్గతం అయ్యాయి. ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఈ పత్రాల్లో వివరణాత్మకంగా ఉంది.

Hamas Targets
Hamas Targets

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 9:19 PM IST

Hamas Targets : ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ మిలిటెంట్లు పన్నిన కుట్ర.. ఆ ప్రణాళిక ప్రకారం చేసిన దాడి ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. ఇజ్రాయెల్‌లోకి చొరబడి ప్రాథమిక పాఠశాలలు, యువ కేంద్రాలపై దాడి చేసి సాధ్యమైనంత ఎక్కువమందిని హతమార్చాలని ముందే హమాస్‌ పక్కా ప్రణాళిక రచించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరణాత్మక పత్రాలను బహిర్గతం చేసింది.

ప్రాథమిక పాఠశాలలే లక్ష్యంగా..
Hamas Targets Civilians :ఇజ్రాయెల్‌లోని ఫర్‌సాద్‌, కిబ్బత్జ్‌ పట్టణాల్లో ప్రాథమిక పాఠశాలలు, యువజన కేంద్రాలను లక్ష్యాలుగా చేసుకోవాలని..ఎక్కువమందిని చంపాలని ప్రజలను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లాలని.. దానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక ఈ పత్రాల్లో ఉందని తెలిపింది. ఈ పత్రాల్లో బయటపడిన సంచలన విషయాలు ప్రపంచాన్ని విస్మయపరిచాయి.

అత్యంత రహస్యమని..
Hamas Attack On Israel : అరబిక్‌ భాషలో ఉన్న ఈ పత్రాలు అత్యంత రహస్యమని కూడా అందులో ఉంది. ఇజ్రాయెల్లో చొరబడి దాడి చేసేందుకు రెండు శిక్షణ పొందిన హమాస్ యూనిట్లను ఉపయోగించాలని ఆ పత్రాల్లో ఉండగా ఆ ప్రణాళిక ప్రకారమే మిలిటెంట్లు చేశారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గ్రామాలను చుట్టుముట్టాలని పౌరులు గుమిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా దాడులు చేయాలని కూడా హమాస్‌ ఉగ్రవాదులు కుట్ర పన్ని దానిని అమలు చేశారని తెలిపింది. ఇజ్రాయెల్‌ దాడిలో హతమైన హమాస్ ఉగ్రవాదుల మృతదేహాల నుంచి ఈ రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలతో పాటు వివరణాత్మక మ్యాప్‌లు కూడా లభించినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు.

"టాప్‌ సీక్రెట్‌" లీక్​!
Hamas Targets Leak :"టాప్‌ సీక్రెట్‌" అనే శీర్షికతో ఉన్న పేజీలో క్ఫర్‌సాద్‌పై దాడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో కొందరు హమాస్‌ మిలిటెంట్లను పాఠశాలపై దాడి చేయమని ఆదేశించగా.. మరికొందరిని ప్రజలను బందీలుగా చేసుకోమని సూచించారు. టాప్ సీక్రెట్ మ్యాన్యువర్‌ అనే శీర్షికన ఉన్న మరో పేజీలో ఫర్‌సాద్‌లో సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని హమాస్‌ యూనిట్లను ఆదేశిస్తున్నట్లు ఉంది.

సమావేశ మందిరాన్ని చుట్టుముట్టి..
Hamas Vs Israel : ఏదైనా సమావేశ మందిరాన్ని చుట్టుముట్టి అందులో బందీలను పట్టుకోవాలని హమాస్‌ యూనిట్లకు సూచించినట్లు ఆ పత్రాల్లో ఉంది. గాజాతో సరిహద్దును పంచుకునే ప్రతి నగరంపై హమాస్ పక్కా నిఘా ఉంచి సమాచారాన్ని సేకరించినట్లు రహస్య పత్రాలను విశ్లేషించిన తర్వాత ఇజ్రాయెల్‌ అధికారులకు అవగతమైంది. తాము చిన్నారులను హత్య చేయలేదని హమాస్‌ ప్రకటన చేయగా.. ఈ పత్రాలతో అది అసత్యమని అర్థమైంది.

Hezbollah Israel Conflict : ఇజ్రాయెల్‌కు 'హిజ్బుల్లా' సవాల్‌.. లక్షకు పైగా రాకెట్లతో!

Hamas Air Force Head Died : హమాస్‌ కీలక కమాండర్‌ మృతి.. సౌదీ కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్​తో డీల్​కు బ్రేక్​!

Israel Enters Gaza : గాజాలోకి ఇజ్రాయెల్​ బలగాలు ఎంట్రీ.. హమాస్​ను​ నాశనం చేస్తామని ప్రధాని ప్రతిజ్ఞ

ABOUT THE AUTHOR

...view details