తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికులకు పోర్న్​ ప్రదర్శన.. ఎందుకంటే?

Airport screens show porn to Travellers: బ్రెజిల్​లోని ఓ ఎయిర్​పోర్ట్​లో అనూహ్య సంఘటన జరిగింది. రియో డి జెనీరియోలోని సాంటోస్ డ్యూమంట్​ విమానాశ్రయంలో ఎలక్ట్రానిక్​ డిస్​ప్లేలు హ్యాకింగ్​కు గురయ్యాయి. అనంతరం వాటిల్లో పోర్నోగ్రఫీ వీడియోలు ప్రసారమయ్యాయి.

Brazil airport
porn shown to travellers

By

Published : May 28, 2022, 6:47 AM IST

Porn in airport screens: రియో డి జెనీరియోలోని ఓ ఎయిర్​పోర్ట్​లో ఎలక్ట్రానిక్ డిస్​ప్లేలు హ్యాకింగ్​కు గురైనట్లు ఫెడరల్​ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించింది బ్రెజిల్ ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఇన్​ఫ్రాఏరో. ప్రకటనలు, విమానాల సమాచారానికి బదులు ప్రయాణికులకు వాటిల్లో పోర్న్​ వీడియోలు చూపించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వాటిని చూసి కొందరు ప్రయాణికులు ఆశ్చర్యానికి గురికాగా, మరికొందరు నవ్వుతూ కనిపించారు. కొందరు ప్రయాణికులు తమ చిన్నారులను వాటిని చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సమాచార సేవలను ఔట్​సోర్సింగ్ ద్వారా మరో కంపెనీ నుంచి పొందుతున్నట్లు ఇన్​ఫ్రాఏరో తన ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థకు కూడా ఈ మేరకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. "మా మీడియా తెరలపై ప్రసారమైన కంటెంట్​కు ప్రకటన హక్కులను కలిగి ఉన్న సంస్థలదే బాధ్యత" అని ఇన్​ఫ్రాఏరో పేర్కొంది. తమ పార్ట్​నర్లు వారి సొంత ప్రసార వ్యవస్థలను వినియోగిస్తారని, దానికి ఇన్​ఫ్రాఏరో ఫ్లైట్ ఇన్​ఫర్మేషన్​ సిస్టమ్​కు సంబంధంలేదని స్పష్టంచేసింది. హ్యాకింగ్​కు గురైన స్క్రీన్​లను ఆఫ్​ చేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:శునకంలా మారిపోయిన జపాన్​ వాసి.. లక్షలు ఖర్చు చేసి...

ABOUT THE AUTHOR

...view details