తెలంగాణ

telangana

ETV Bharat / international

H1B వీసాదారులకు గుడ్​న్యూస్​.. ఇక అమెరికాలోనూ స్టాంపింగ్!

హెచ్​-1 బీ వీసాదారులకు అమెరికాలోనూ స్టాంపింగ్​ చేసుకునే సదుపాయం కల్పించాలంటూ ప్రవేశపెట్టిన సిఫార్సును ఆ దేశ అధ్యక్ష కమిషన్​ ఆమోదించింది. అయితే ఆ సిఫార్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఆమోదం తెలిపితే ఎంతోమంది భారతీయులకు ఉపశమనం లభించనుంది. అసలు ఆ సిఫార్సులో ఏముందంటే?

h1b-visa-stamping-could-be-soon-inside-us-in-relief-for-indians
h1b-visa-stamping-could-be-soon-inside-us-in-relief-for-indiansh1 b visa validity

By

Published : Sep 30, 2022, 5:24 PM IST

H1B Visa Stamping: హెచ్​-1 బీ వీసాదారులకు గుడ్​న్యూస్. ఇక నుంచి​ అమెరికాలో హెచ్​-1 బీ వీసాలకు స్టాంపింగ్​ చేసుకునే అవకాశం రానుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆసియా అమెరికన్ల, పసిఫిక్​ ద్వీపవాసులు ఉన్న ఆ దేశ అధ్యక్ష కమిషన్​ ఆమోదించింది. అయితే ఈ సిఫార్సును అధ్యక్షుడు జో బైడెన్​ ఆమోదిస్తే ఎంతో మంది విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయులకు ఉపశమనం లభించనుంది.

బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కమిషన్​ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఎక్కువ మంది భారతీయులు.. హెచ్​ 1బీ వీసాల పునురుద్ధరణ కోసం వేచి చూస్తుండడం వల్ల కమిషన్ సభ్యుడు భారతీయ అమెరికన్ అజయ్ జైన్ భూటోరియా ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు.

"స్టాంపింగ్​ ప్రక్రియలో భాగంగా హెచ్​-1 బీ వీసాదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీసాలు రెన్యువల్​ జరగక అనేక మంది తమ కుటుంబాలతో దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు అనారోగ్యం పాలై ఐసీయూలో ఉన్నా.. తమ ఇంటికి వెళ్లలేకపోతున్నారు. మరికొందరు భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం భారత్​లో వీసా స్టాంపింగ్​ అపాయింట్​మెంట్​ పొందడానికి 844 రోజులు పడుతోంది. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది."

-- అజయ్​ జైన్​ భూటోకరియా, కమిషన్​ సభ్యుడు

ప్రతిపాదనలో ఏముందంటే?
హెచ్​-1 బీ వీసాదారుల ప్రక్రియను పరిశీలించే యూఎస్​సీఐఎస్​ విధివిధానాల్లో మార్పులు చేపట్టాలి. చాలా ఏళ్ల క్రితం పొందుపరిచిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించాలి. అమెరికాలోనూ స్టాంపింగ్‌ చేసే సదుపాయం కల్పించాలి. గడువు ముగిసిన వీసాతో అమెరికాలోకి అనుమతించాలి. తమ స్వదేశాల్లో స్టాంపింగ్​ అవ్వకుండానే అమెరికాలోకి ప్రవేశం కల్పించాలి.

హెచ్​-1బీ వీసా అంటే?
'హెచ్‌-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అమెరికా వెళ్లగలుగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details