తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్కెట్​లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి.. 10 మందికి గాయాలు - ఇరాన్​ నిరసనకారులపై కాల్పులు

ఇరాన్‌లో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 10 మందికిపైగా గాయపడ్డారు.

Gunmen attack bazaar in Iran
Gunmen attack bazaar in Iran

By

Published : Nov 17, 2022, 7:03 AM IST

ఇరాన్‌ మహిళలకు ఆ దేశ ప్రభుత్వం నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను నిరసిస్తూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ ఆందోళనలు మరింత ఉద్ధృత రూపం దాల్చాయి. మహిళలు పెద్ద ఎత్తున ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో ఆందోళనలు చేపడుతుండగా కొందరు దుండగులు.. నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఆందోళనకారులు మరణించారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు.

కొన్ని ఉగ్రవాద శక్తులు నిరసనకారులు, భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇరాన్ నైరుతి వైపున ఉండే ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందని అధికారిక మీడియా బుధవారం తెలిపింది. రెండు మోటార్ సైకిల్స్​పై సాయుధ, ఉగ్రవాద శక్తులు ఇజెహ్ సిటీలోని సెంట్రల్ మార్కెట్‌లోకి వచ్చాయని, అక్కడే నిరసనకారులుపై ఫైరింగ్ చేశాయని చెప్పింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.

ABOUT THE AUTHOR

...view details