Green Card Bill In Senate : గ్రీన్‌కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు. ఈ బిల్లును సెనేటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశపెట్టగా.. ఎలిజిబెత్ వారెన్, బెన్ రే లుజన్, విప్ డిక్ డర్బిన్ అనే సెనేటర్లు బలపరిచారు. ఈ బిల్లు వల్ల వలసదారులకు అపార ప్రయోజనం చేకూరనుంది.
వలసదారులు కనీసం ఏడు సంవత్సరాలు అమెరికాలో నివసిస్తే.. గ్రీన్‌కార్డు జారీ చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. వలసదారులు ఏడు సంవత్సరాలు తర్వాత శాశ్వతంగా యూఎస్‌లో నివసించేందుకు గ్రీన్‌కార్డు లభిస్తుంది. గ్రీన్‌కార్డు బిల్లు అమలైతే ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులకు అపార ప్రయోజనం ఉంటుంది.
"పాత ఇమిగ్రేషన్ విధానం ద్వారా మిలియన్ల మంది వలసదారులు నష్టపోయారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ బిల్లు ద్వారా 8 మిలియన్ల వలసదారులకు ఊరట లభించనుంది. కొంతమంది వలసదారులు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నారు. దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధిలో సహకరిస్తున్నారు. అలాంటి వారికి స్వేచ్ఛగా యూఎస్‌లో జీవించడానికి అనుమతించే హక్కును కల్పించేందుకే గ్రీన్‌కార్డు బిల్లును ప్రవేశపెట్టాం."