అమెరికా కోస్టారికా ప్రాంతాంలోని కరేబియన్ సముద్రంలో ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలగా.. ప్రఖ్యాత గోల్డ్స్ జిమ్ అధిపతి సహా మొత్తం ఆరుగురు మరణించారు. మృతుల్లో గోల్డ్స్ జిమ్ ఓనర్, మెక్ఫిట్ వ్యవస్థాపకులు రైనర్ షాలర్తో పాటు మరో నలుగురు జర్మనీయులు, అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ పైలట్ ఉన్నారు.
మెక్సికో నుంచి శుక్రవారం బయలుదేరిన విమానం కరేబియన్ తీరంలోని లిమోన్ వద్దకు చేరుకునే సమయంలో రాడార్ నుంచి అదృశ్యమయ్యింది. విమానం కనిపించకుండా పోయిన తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించిన అధికారులకు మరుసటి రోజు నీటిలో దాని శకలాలు కనుగొన్నారు. గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఆ పనిని తాత్కాలికంగా నిలిపేశామని అధికారులు తెలిపారు.