Germany covid: ఒక వ్యక్తి రెండు సార్లు లేదా బూస్టర్ డోసుతో కలిపితే మూడు సార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటారు. కానీ, జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 90 సార్లు టీకా వేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోనివారికి అక్రమంగా టీకా ధ్రువపత్రం ఇవ్వడానికి నిందితుడు ఇలా చేశాడు. జర్మనీలోని మాగ్డేబర్గ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గత కొద్ది నెలలుగా ఈ అక్రమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నుంచి కొన్ని వ్యాక్సిన్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.
90 కొవిడ్ టీకాలు వేసుకున్న వృద్ధుడు.. కారణం తెలిసి పోలీసులు షాక్ - జర్మనీ కొవిడ్
Germany covid: జర్మనీకి చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి ఏకంగా 90 సార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోనివారికి అక్రమంగా టీకా ధ్రువపత్రాలను అందించడం కోసం ఇలా చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
జర్మనీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, విమానాశ్రయాలు వంటి చోట్లకు ప్రవేశించాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. దీంతో వ్యాక్సిన్ వేసుకోదలచుకోనివారు అక్రమంగా టీకా ధ్రువపత్రాన్ని పొందుతున్నారు. దీనిపై పోలీసుల నిఘా కూడా కొనసాగుతోంది. అయితే.. అక్రమంగా ఇతరుల పేర్లపై టీకా వేసుకుని, వారికి టీకా ధ్రువపత్రం ఇచ్చేవాడు నిందితుడు. ఐలెన్‌బర్గ్‌లోని టీకా కేంద్రానికి వరుసగా రెండు రోజులపాటు టీకా కోసం రాగా.. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాను 90 టీకాలు వేసుకున్నట్లు, అవి కూడా వేర్వేరు కంపెనీలవని నిందితుడు ఒప్పుకున్నాడని ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే.. వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంకా తెలియలేదు. వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. నిందితుడి వయసు 60 ఏళ్లు కావడం గమనార్హం.