తెలంగాణ

telangana

ETV Bharat / international

లింగ సమానత్వ సూచీలో 135వ స్థానంలో భారత్.. అగ్రస్థానం ఎవరిదంటే? - స్త్రీ పురుష సమానత్వంలో 135న స్థానంలో భారత్

gender gap report 2022: లింగ సమానత్వ సూచీలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక ఫోరానికి చెందిన జండర్ గ్యాప్ రిపోర్ట్- 2022లో ఈ విషయాలు బయటపడ్జాయి. స్తీ, పురుష సమానత్వంలో ఐస్‌లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది.

gender gap report 2022
జండర్ గ్యాప్ రిపోర్టు 2022

By

Published : Jul 14, 2022, 7:09 AM IST

gender gap report 2022: స్త్రీ, పురుష సమానత్వం విషయంలో భారత్‌ అట్టడుగున 135వ స్థానంలో ఉంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకినా ప్రపంచంలో ఇంకా చివరి స్థానాల్లోనే భారత్‌ ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి (డబ్ల్యూఈఎఫ్‌) చెందిన జండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ - 2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్‌ తరవాత స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, కాంగో, ఇరాన్‌, చద్‌లు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

స్త్రీ, పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్‌లాండ్‌ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ ప్రపంచంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరవాత స్థానాల్లో ఫిన్లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌లు ఉన్నాయి. జీవన వ్యయం భారీగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం మహిళలపై ఎక్కువ ఉంటుందని అది స్త్రీ పురుషుల మధ్య అసమానతల పెరుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొంటూ.. వీటిని రూపుమాపేందుకు కనీసం 132 ఏళ్లు పడుతుందని డబ్ల్యూఈఎఫ్‌ హెచ్చరించింది. కొవిడ్‌ కారణంగా ఒక తరం క్రితం ఉన్న నాటి పరిస్థితులకు చేరాయని పేర్కొంది.

2021తో పోలిస్తే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం, అవకాశాల విషయంలో చాలా సానుకూల మార్పులు ఉన్నాయని స్త్రీ, పురుష కార్మికుల భాగస్వామ్యం మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్ల శాతం 14.6 నుంచి 17.6 శాతానికి పెరిగిందని.. మహిళా సాంకేతిక పని వారి శాతం 29.2 నుంచి 32.9కి హెచ్చిందని వివరించింది. రాజకీయ సాధికారత విషయంలో భారత్‌ 48వ స్థానంలో ఉంది. ఆరోగ్యం, మనుగడ(సర్వైవల్‌) సూచీలో భారత్‌ చిట్టచివరి స్థానం(146)లో ఉండటం గమనార్హం. 146 దేశాల్లోని వివిధ ప్రామాణికాలను ప్రపంచ ఆర్థిక ఫోరం పరిశీలించి ఈ వివరాలను వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details