Gaza Humanitarian Crisis :ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలోని ఆస్పత్రులు నరకప్రాయంగా మారాయి. ఆస్పత్రుల్లో ప్రతిమూలా క్షతగాత్రుల రోదనలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు, పసిపిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల దృశ్యాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. తమవారి మృతదేహాల పక్కనే కూర్చుని తల్లడిల్లుతున్న నిస్సహాయుల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. కాలిన గాయాలు, స్వల్పంగా కాళ్లు, చేతులు విరిగిన చిన్నారులు అటూ ఇటూ తిరుగుతుండటం అక్కడ సాధారణం అయిపోయింది.
Israel Hamas War :తీవ్రంగా గాయపడి, కొనఊపిరితో వస్తున్న క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందించలేక పోతున్నారు. సాయం కోసం చిన్నారుల తల్లిదండ్రులు వేడుకుంటున్నప్పటికీ వైద్య పరికరాల సరఫరా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చిన్నారులకు మత్తుమందు ఇవ్వకుండానే శస్త్రచికిత్సలు చేస్తుండటంతో నొప్పితో విలవిల్లాడిపోతున్నారు. గాయాలు శుభ్రం చేసుకోవడానికి కనీసం నీరు కూడా అందుబాటులో లేకుండా పోవడం వల్ల బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు.
50వేల మందికి 4 టాయిలెట్లు..
గాజాలోని ఆస్పత్రుల్లో ఉంటే తమ ప్రాణాలకు ముప్పని తెలిసినా.. వైద్య సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు. దక్షిణ గాజాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఖాన్ యూనిస్ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 50వేల మంది ఇక్కడ ఉంటే వారందరికీ కలిపి కేవలం 4 టాయిలెట్లే ఉన్నాయి. రోజుకు 4 గంటలే నీటి సరఫరా జరుగుతోంది.
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ సొరంగాలు ధ్వంసం...
Hamas Tunnels Destroyed :మరోవైపు, హమాస్‌కు చెందిన 130 సొరంగాల ప్రవేశ ద్వారాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్‌కు చెందిన టన్నెళ్లు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆస్తులను గుర్తించేందుకు కంబాట్ ఇంజినీరింగ్ విభాగం పని చేస్తోందని తెలిపింది. అదే సమయంలో, హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ తలదాచుకున్న బంకర్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం వెల్లడించింది. యుద్ధం చివరి దశకు చేరిందని పేర్కొంది. గాజా బిన్లాడెన్గా పేరుగాంచిన సిన్వర్‌ను లక్ష్యంగా చేసుకొనే ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తోంది.
టన్నెల్‌ను పూడ్చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ సైనికులు భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది: అమెరికా
కాగా, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం వేళ భారత్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల విషయంలో తన వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. నిర్దిష్టమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది పూర్తిగా భారత్ ఇష్టమని స్పష్టం చేసింది. భారత్‌తో ఎప్పటికీ వ్యూహాత్మక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా అంకితభావంతో పనిచేస్తుందని తెలిపింది.
గాజాను రెండుగా చీల్చిన ఇజ్రాయెల్- యుద్ధంలో కీలక పరిణామం
గాజాలో హమాస్ పాలన అంతమైతే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ పరిపాలన సాగిస్తుందా? అమెరికా ప్లాన్ అదేనట!