తెలంగాణ

telangana

ETV Bharat / international

G20 Leaders Praises Bharat : భారత్‌పై జీ20 నేతల ప్రశంసలు.. సదస్సు నిర్వహణ అద్భుతమని కితాబు - భారత్ జీ20 సదస్సు2023 దిల్లీ డిక్లరేషన్

G20 Leaders Praises Bharat : దిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సుపై సభ్య దేశాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశాలు జరిగిన తీరును, జీ20కి భారత్‌ అధ్యక్షతను ప్రశంసించారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాలు సహా రష్యా కూడా ఈ అంశంపై డిక్లరేషన్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్‌పై ప్రశంసలు కురిపించాయి.

G20 Leaders Praises Bharat :
భారత్‌పై జీ20 నేతల ప్రశంసలు

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 6:33 AM IST

G20 Summit India 2023 :దిల్లీలో జరిగిన 18వ జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుపై అన్ని దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌ అంశంపై భిన్న వైఖరులు కలిగి ఉన్న అమెరికా, రష్యా కూడా సదస్సు నిర్వహణ అద్భుతంగా జరిగిందని తెలిపాయి. జీ20లోని ప్రధాన భావన అయిన ఒకే భూమి,ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు.. ఈ భాగస్వామ్యం కట్టుబడి ఉందని బైడెన్‌ అన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన బైడెన్‌.. స్థిర, స్థితిస్థాపక మౌలిక సదుపాయాల నిర్మాణం, నాణ్యమైన మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు, మెరుగైన భవిష్యత్తు సృష్టించే విజన్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

India G20 Success :G20కి అధ్యక్షత వహించిన భారత్‌.. ప్రపంచ ఐక్యత కోసం తనవంతు కృషి చేసిందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నానన్న మేక్రాన్‌.. భారత దేశం తన సూత్రాలకు కట్టుబడి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ సమయంలో శాంతి సందేశాలు అందించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌.. భారత్‌ అధ్యక్షతను కొనియాడారు. చరిత్రలో తొలిసారి G20 దేశాలను భారత్‌ నేతృత్వం నిజంగా ఏకీకృతం చేసిందని ప్రశంసించారు. డిక్లరేషన్‌లో రష్యా-ఉక్రెయన్‌ పేరాగ్రాఫ్‌ను మిగిలిన భాగం నుంచి విడదీయలేమన్న ఆయన.. దీనికి పశ్చిమదేశాలు అంగీరిస్తాయని ఊహించలేదన్నారు. భారత్‌ అధ్యక్షతన అన్ని దేశాలు సంయుక్త ప్రకటనను అంగీకరించడమనేది.. నిజంగా అర్థవంతమైన విజయమని జపాన్‌ ప్రధాని పుమియో కిషిద అన్నారు.

ABOUT THE AUTHOR

...view details