అఫ్గానిస్థాన్‌లో ఘోరం జరిగింది. సొరంగ మార్గంలో ఇంధన ట్యాంకర్ పేలి దాదాపు 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న సలాగ్ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఈ ఘటన జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో ఇంధన ట్యాంకర్ పేలింది. కొంత మంది శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయాయని, సొరంగాన్ని క్లియర్ చేసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టన్నెల్లో పేలిన ఇంధన ట్యాంకర్.. 19 మంది మృతి.. అనేక మందికి గాయాలు - అఫ్గానిస్థాన్‌లోని సలాగ్ సొరంగ మార్గం
అఫ్గానిస్థాన్‌లోని ఓ సొరంగ మార్గంలో ఇంధన ట్యాంకర్ పేలి 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అఫ్గానిస్థాన్‌లోని సొరంగంలో పేలుడు
"ప్రమాదానికి గురైనవారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంత మంది మాత్రం గుర్తుపట్టలేనంతగా గాయపడ్డారు" అని బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
కాబుల్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఈ సలాగ్ టన్నెల్ ఉంటుంది. ఆ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను ఇది కలుపుతుంది. సోవియట్ యూనియన్ సహాయంతో ఈ సొరంగ మార్గాన్ని 1960లో అఫ్గానిస్థాన్ నిర్మించింది.