Charles Sobharaj released from the jail: కరడుగట్టిన హంతకుడు, ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78).. జైలు నుంచి విడుదల అయ్యాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతడిని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించగా.. అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. చార్లెస్‌కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులేమీ లేకపోతే విడుదల చేసి 15రోజుల్లోపు అతడిని స్వదేశానికి పంపేయాలని నేపాల్ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సూచించింది.
జైలు నుంచి విడుదలైన కొద్ది గంటలకే నేపాల్ అధికారులు శోభరాజ్‌ను ఫ్రాన్స్‌కు పంపేశారు. మరో పదేళ్లపాటు తమ దేశానికి రాకూడదని స్పష్టం చేశారు.
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ రిలీజ్- వెంటనే ఫ్రాన్స్‌కు... - సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్
అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు చార్లెస్‌ను విడిచిపెట్టారు. నేపాల్ అధికారులు అతడ్ని కొద్దిగంటలకే ఫ్రాన్స్‌కు పంపేశారు. మరో పదేళ్లపాటు నేపాల్ రాకూడదని స్పష్టం చేశారు.
ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యటకులను చంపిన కేసులో శోభరాజ్‌ను 2003లో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేపాల్ సుప్రీంకోర్టు అతడికి 21ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటినుంచి అతడు నేపాల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, సుమారు 20ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం వంటి కారణాలతో అతడి విడుదల చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేయగా ఎట్టకేలకు చార్లెస్ విడుదలయ్యాడు. అంతకుముందు దిల్లీలోని హోటల్‌లో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయిన చార్లెస్ 1997వరకు భారత్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవించాడు.
నేర చరిత్ర:
చార్లెస్ శోభరాజ్ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే వారు విడిపోయారు. దీంతో తన తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టాక శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేయగా అతడు నేరాల బాటపట్టాడు. 1970లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. ఆపై 20 హత్య కేసుల్లో చిక్కుకున్న శోభరాజ్.. దిల్లీలోని ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయి భారత్‌లోని వివిధ జైళ్లలో 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు.