France New PM : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నూతన ప్రధానిగా 34ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ను నియమించారు. ఆ దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా అట్టల్ నిలిచారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టం విషయమై దుమారం రేగటం వల్ల ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేయటం వల్ల గాబ్రియేల్ అట్టల్‌ను నియమించాల్సి వచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేపట్టిన నూతన ప్రధాని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫ్రాన్స్ నూతన ప్రధాని గాబ్రియేల్ అట్టల్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో గాబ్రియేల్ అట్టల్ 34 ఏళ్ల గాబ్రియల్ అట్టల్ 2020 నుంచి 2022 వరకు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఈ తర్వాత విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. అంతేగాక గాబ్రియల్ ఫ్రాన్స్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మెట్టమొదటి స్వలింగ సంపర్కుడు గాబ్రియల్ అట్టల్ కావడం గమనార్హం.
ఫ్రాన్స్ నూతన ప్రధాని గాబ్రియేల్ అట్టల్ ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీమామా చేశారు. కొత్త చట్టం ప్రకారం విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారులు లభిస్తాయి. 2022లో ప్రధానిగా బోర్న్ బాధ్యతలు చేపట్టారు. 2024 జనవరి 8న పదవి నుంచి వైదొలిగారు.
ఫ్రాన్స్ నూతన ప్రధాని గాబ్రియేల్ అట్టల్ 'భారత్-ఫ్రాన్స్ మధ్య బలమైన బంధం'
భారత్, ఫ్రాన్స్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌ను ఆహ్వానించింది భారత్. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించినట్లు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిపబ్లిక్ డే వేడుకలకు భారత్ ఆహ్వానించింది. మరోవైపు, గతేడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం- బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
2023 సెప్టెంబరులో భారత్ వేదికగా దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ఇమ్మానుయేల్ మేక్రాన్ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో చర్చలు జరిగాయని ఈ సందర్భంగా మేక్రాన్ తెలిపారు. బాస్టిల్ డే పరేడ్‌కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారని పేర్కొన్నారు.