రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయడానికి ముందు తనకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడని బోరిస్ పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా క్షిపణి దాడికి పాల్పడతానని ఫోన్‌లో పుతిన్ హెచ్చరించినట్లు తెలిపారు. తనకు హాని చేసే లేదని పుతిన్ చెప్పారని పేర్కొన్న బోరిస్.. అదే సమయంలో క్షిపణి దాడి తప్పదని బెదిరించినట్లు వెల్లడించారు. ఒకే ఒక్క నిమిషంలో క్షిపణి దాడి చేస్తానని.. అంతా అయిపోతుందని పుతిన్ తనతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన విషయాలను తాజాగా జాన్సన్ బయటపెట్టారు.
'ఒక్క నిమిషంలో మీపై క్షిపణి దాడి చేస్తా.. అంతా ఫినిష్!'.. ప్రధానికి పుతిన్ వార్నింగ్ - bbc documentary putin missile strike
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టి ఏడాది పూర్తవుతున్న వేళ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ముందు పుతిన్ ఫోన్ చేశారని చెప్పిన జాన్సన్... తనపై క్షిపణి దాడి చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. నాటోలో ఉక్రెయన్ చేరికపైనా పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాన్సన్ తెలిపారు. ఈ మేరకు బోరిస్ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని తాజాగా బీబీసీ ప్రసారం చేసింది.

boris putin missile threat
అదే సమయంలో నాటోలో ఉక్రెయన్ చేరికపైనా పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాన్సన్ తెలిపారు. ఆ సమయంలో తాను చాలా సహనంతో వ్యవహరించినట్లు గుర్తు చేసుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దండయాత్రను ఖండించిన పశ్చిమ దేశాధినేతల్లో అప్పట్లో బోరిస్ జాన్సన్ ముందువరుసలో నిలిచారు. యుద్ధం ప్రారంభమైన కొన్నిరోజుల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించిన బోరిస్ జాన్సన్.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు తాజాగా బోరిస్ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది.