తెలంగాణ

telangana

ETV Bharat / international

జైల్లో ఖైదీల గొడవ.. భారీ అగ్నిప్రమాదం.. 49 మంది మృతి! - కొలంబియా న్యూస్​

Colombia Prison: ఓ జైల్లో అగ్నిప్రమాదం సంభవించగా.. 49 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన కొలంబియాలో జరిగింది. ఖైదీల గొడవే ప్రమాదానికి కారణమని సమాచారం.

Fire kills 49 following riot at prison in Colombia
Fire kills 49 following riot at prison in Colombia

By

Published : Jun 28, 2022, 6:54 PM IST

Colombia Prison: కొలంబియాలోని తులువా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైల్లో జరిగిన ఈ ఘటనలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్దీ గాయపడ్డారు. ఈ మేరకు జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు.
చనిపోయినవారంతా ఖైదీలా? కాదా? అనేది స్పష్టత లేదని తెలిపారు నేషనల్​ ప్రిజన్​ సిస్టమ్​ డైరెక్టర్​ టిటో కాస్టెల్లనోస్​. అయితే.. సోమవారం ఉదయం జైల్లో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే మంటలు చెలరేగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details