Finland PM Drug Test: మిత్రులతో కలిసి పార్టీ చేసుకొన్నందుకు గానూ ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించి ఉండొచ్చని, ప్రధాని వాటిని తీసుకొని ఉండొచ్చని విపక్షాలు నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో మారిన్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ పరీక్ష చేయించుకున్నారు.
'అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు నేను డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నాను. ఒక వారంలో పరీక్షా ఫలితాలు వస్తాయి. అవి వచ్చిన వెంటనే వాటిని మీడియాతో పంచుకుంటాను' అని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.