తెలంగాణ

telangana

ETV Bharat / international

చర్చి బయట తుపాకీ మోత.. ఇద్దరు మహిళలు మృతి.. నిందితుడు కూడా! - ముగ్గరు మృతి అమెరికా

అమెరికాలోని ఏమ్స్​లో గురువారం తుపాకుల మోత మోగింది. కార్నర్​స్టోన్​ చర్చి బయట జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో నిందితుడు కూడా ఉన్నాడు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల వెపన్స్‌ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు.

FES8-US-SHOOTING
FES8-US-SHOOTING

By

Published : Jun 3, 2022, 8:39 AM IST

Updated : Jun 3, 2022, 10:21 AM IST

Shooting At Church:అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మెక్సికో, ఓక్లహోమా ఘటనలు మరువక ముందే.. ఏమ్స్‌లోని కార్నర్‌స్టోన్ చర్చి బయట మారోమారు తుపాకీ గర్జించింది. ఆగంతుకుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. ఘటనాస్థలిలో దుండగుడి మృతదేహాన్ని సైతం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుండగుడు కాల్పులు జరిపాక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
అమెరికాలో గురువారం మరో చోట కూడా కాల్పులు జరిగాయి. విస్కాన్సిన్​లోని గ్రేస్​ల్యాండ్​ శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో చెలరేగాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఓ 37ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు ఖననం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

బైడెన్​ కీలక నిర్ణయం.. ఈ మధ్యకాలంలో అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఉదంతాలు- అగ్రరాజ్యం అమెరికాను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా ప్రేరేపించాయి. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న తుపాకుల సంస్కృతిపై ఉక్కుపాదం మోపే దిశగా కదిలించాయి. రక్తపాతాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. త్వరలోనే వాటిపై చట్టాలను తీసుకొస్తామని వెల్లడించారు.

అమెరికాలో 18 సంవత్సరాలు నిండిన వారెవరైనా తుపాకులను కొనుగోలు చేయవచ్చు. ఈ వయస్సు నిబంధనను సవరించనున్నట్లు జో బైడెన్ తెలిపారు. ఇకపై 21 సంవత్సరాలు నిండిన వారే గన్స్ కొనుగోలు చేయగలరని అన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను కోరారు. హైకెపాసిటీ మేగజైన్స్‌లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్‌ను నింపవచ్చని, వాటిని కూడా నియంత్రించాలని సూచించారు. వాటితో పాటు ఏకే 47, ఏకే 15 సహా.. తొమ్మిది రకాల వెపన్స్‌ను నిషేధించేలా చట్టాన్ని తెస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. నిందితుడితో సహా ఐదుగురు మృతి

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌​ ఆయుధాలు.. శిక్షణ ఇచ్చి మరీ.. అమెరికా బాటలోనే!

Last Updated : Jun 3, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details