తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​కు భారీ ఊరట.. 'గ్రే లిస్ట్' నుంచి నాలుగేళ్ల తర్వాత తొలగింపు..

FATF Pakistan : దాయాది దేశం పాకిస్థాన్​కు ఊరట లభించింది. 'గ్రే లిస్ట్' నుంచి ఆ దేశాన్ని తొలగించింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్. ఫలితంగా ఇక నుంచి పాక్​కు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు నిధులు పొందే అవకాశం లభించనుంది.

fatf pakistan
పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్

By

Published : Oct 21, 2022, 8:49 PM IST

Updated : Oct 21, 2022, 10:39 PM IST

FATF Pakistan : అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు ఊరట లభించింది. ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్(ఎఫ్​ఏటీఎఫ్). గురు, శుక్రవారాల్లో సింగపూర్​లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్ష్యాలను పాకిస్థాన్ అందుకోకపోవడం వల్ల ఎఫ్​ఏటీఎఫ్ నాలుగేళ్ల నుంచి ఆ దేశాన్ని గ్రే లిస్ట్​లో ఉంచింది.
పాక్‌తోపాటు నికారాగువా కూడా గ్రే లిస్టు నుంచి బయటపడింది. మయన్మార్‌ గ్రే లిస్టు నుంచి బ్లాక్‌ లిస్టులోకి వెళ్లింది. గ్రే లిస్టు, బ్లాక్ లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. గ్రే లిస్టు, బ్లాక్ లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.

జైషే మహ్మద్ అధినేత మసూర్ అజార్​, లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్​, అతని సహాయకుడు జకీవుర్ రెహమాన్ లఖ్వీలపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైన నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలిసారిగా 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. వీటి విషయంలో పాక్ సంతృప్తికర చర్యలు తీసుకుందని భావించిన ఎఫ్​ఏటీఎఫ్​.. ఎట్టకేలకు గ్రే లిస్ట్ నుంచి తొలగించింది.

Last Updated : Oct 21, 2022, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details