Explosion In Hotel: క్యూబా రాజధాని హవానాలో 'సరటోగా' ఫైవ్‌స్టార్ హోటల్లో శుక్రవారం ఉదయం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 74 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 14 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చుట్టుపక్కల ఆసుపత్రులకు తరలించారు. ఈ భవనం పక్కన ఉన్న స్కూలును వెంటనే అధికారులు ఖాళీ చేయించారు.
ఫైవ్‌స్టార్ హోటల్లో భారీ పేలుడు.. 25 మంది మృతి - హవానా హోటల్
Explosion In Hotel: గ్యాస్ లీకేజీ కారణంగా క్యూబా రాజధాని హవానాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 74 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారు.
Explosion In Hotel
శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ లీకేజీగా కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి హోటల్ బయట ఉన్న బస్సులు, కార్లు కూడా ధ్వంసమయ్యాయి. 96 గదులు, రెండు రెస్టారెంట్లు ఉన్న ఈ హోటల్ 1930లో నిర్మించారు.
ఇదీ చదవండి:మరింత ముదిరిన శ్రీలంక సంక్షోభం.. మరోసారి ఎమర్జెన్సీ
Last Updated : May 7, 2022, 8:49 PM IST