తెలంగాణ

telangana

ETV Bharat / international

హైప్రొఫైల్ సెక్స్ రాకెట్- ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ సహా 100 మందికి పైగా ప్రముఖుల పేర్లు - ఎప్​స్టీన్ లిస్ట్ ట్రంప్

Epstein List New Detail : అమెరికాలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించి 40 రహస్య పత్రాలను న్యూయార్క్‌ కోర్టు విడుదల చేసింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ, పాప్‌ ఐకాన్‌ మైఖెల్‌ జాక్సన్‌ సహా వంద మందికిపైగా ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. క్లింటన్‌, ట్రంప్‌పై ఎలాంటి ఆరోపణలు లేవు. అయితే ఆండ్రూపై గతంలో వచ్చిన ఆరోపణలకు సంబంధించి మాత్రమే ఈ పత్రాల్లో ఉంది.

Epstein List New Details
Epstein List New Details

By PTI

Published : Jan 4, 2024, 1:57 PM IST

Epstein List New Details :అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్‌ సెక్స్‌ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ దుర్మార్గాల చిట్టాకు సంబంధించి మరికొన్ని రహస్య పత్రాలను న్యూయార్క్‌ కోర్టు బయటపెట్టింది. తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన న్యూస్‌పేపర్‌ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌తో ఎప్‌స్టీన్‌ సాన్నిహిత్యం, బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పాప్‌ ఐకాన్‌ మైఖెల్‌ జాక్సన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సహా 100 మందికిపైగా పేర్లు ఉండటం గమనార్హం.

ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో మైఖెల్‌ జాక్సన్‌ ప్రస్తావన ఉంది. ఎప్‌స్టీన్‌కు చెందిన ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ నివాసంలో తాను ఓ సారి ఆయన్ను కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, అప్పుడు ఆ పాప్‌స్టార్‌ తనను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని తెలిపారు. మరో వాంగ్మూలంలో ప్రిన్స్‌ ఆండ్రూపై సోబెర్గ్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్‌ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని తెలిపారు. అప్పుడు ప్రిన్స్‌ తనను అసభ్యంగా తాకినట్లు పేర్కొన్నారు.

బ్రిటన్‌ ప్రిన్స్ ఆండ్రూ, డొనాల్డ్ ట్రంప్ (పాత చిత్రం)

'ట్రంప్ క్యాసినోలో గడిపాం!'
ఇదే వాంగ్మూలంలో బిల్‌ క్లింటన్‌, ట్రంప్‌ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. న్యూయార్క్‌కు వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఎప్‌స్టీన్‌ తన ప్రైవేట్‌ జెట్‌ను న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీకి మళ్లించాడని, అక్కడ తాము కొన్ని గంటల పాటు ట్రంప్‌ క్యాసినోలో ఉన్నట్లు సోబెర్గ్‌ తెలిపారు. అయితే, తాను ట్రంప్‌ను కలవలేదని, బిల్‌ క్లింటన్‌ను కూడా తానెప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదని తెలిపారు. ఆయనకు బాలికలు, యువతులంటే ఇష్టమని ఎప్‌స్టీన్‌ ఓసారి తనతో అన్నాడని సోబెర్గ్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ పత్రాల్లో ఉంది.

జెఫ్రీ ఎప్​స్టీన్

అమెరికాను కుదిపేసిన కుంభకోణం
గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు ఎప్‌స్టీన్‌ పాల్పడిన సెక్స్‌ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్‌ బీచ్‌ బంగ్లాకు పిలిపించి ఎప్‌స్టీన్‌ అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమీషన్‌ ఇస్తానని ఆశచూపేవాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. అప్పుడు ఎప్‌స్టీన్‌ను అరెస్టు చేసి కొన్ని నెలలు పాటు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు రాగా అతడిని అరెస్టు చేశారు.

జెఫ్రీ ఎప్​స్టీన్, మాక్స్​వెల్

జైల్లోనే ఆత్మహత్య
సెక్స్‌-ట్రాఫికింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సమయంలోనే 2019 ఆగస్టులో ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితులను నియమించుకోవడంలో ఎప్‌స్టీన్‌కు సహాయపడ్డ ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ మాక్స్‌వెల్‌ 2021లో దోషిగా తేలింది. 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తోంది. ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని పత్రాలు బయటకు రానున్నాయి.

ఆ ఫైనాన్షియర్ 'వలపు వల'లో ఇద్దరు మాజీ అధ్యక్షులు!

అమెరికా మాజీ అధ్యక్షుడికి బిగ్​ షాక్​- ప్రైమరీ బ్యాలెట్​ నుంచి డొనాల్డ్​ ట్రంప్​ ఔట్​!

ABOUT THE AUTHOR

...view details