తెలంగాణ

telangana

ETV Bharat / international

రహస్య పత్రాల కేసులో ట్రంప్​కు మరిన్ని చిక్కులు - ట్రంప్​ ఇంట్లో దొరికిన రహస్య పత్రాలు

రహస్య పత్రాల తరలింపు వివాదంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన దర్యాప్తు బృందం కొన్ని రహస్య పత్రాలను గుర్తించి, కోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

documents in trump home
ట్రంప్​ ఇంట్లో రహస్య పత్రాలు

By

Published : Aug 31, 2022, 5:15 PM IST

Donald trump house : రహస్య పత్రాల తరలింపు వివాదంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూరుకుపోతున్నారు. జూన్‌లో ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే పత్రాలను దాచి ఉండొచ్చని దర్యప్తు బృందం కోర్టుకు నివేదిక ఇచ్చింది. తనిఖీ ఏజెంట్లను మార్‌ ఎ లాగో ఎస్టేట్‌లోని స్టోరేజ్‌రూమ్‌ వద్ద ఉద్దేశపూర్వకంగానే అడ్డుకొన్నారని పేర్కొంది. ఇతర రికార్డులను దాచిపెట్టడంగానీ, తొలగించడంగానీ చేసి ఉండొచ్చని తెలిపింది. అప్పట్లో స్టోర్‌ రూమ్‌ వద్ద బాక్సులను తెరిచేందుకు ట్రంప్‌ ప్రతినిధులు ఏమాత్రం అంగీకరించలేదన్నారు. దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన 54 పేజీల ఫైలింగ్‌ను విడుదల చేశారు. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

గతంలో చాలా సార్లు ఎఫ్‌బీఐ అధికారులు అభ్యర్థించినా.. ట్రంప్‌ బృందం ఆ పత్రాలను ఇవ్వడానికి నిరాకరించిందని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ జే బ్రాట్‌ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టిన గంటల వ్యవధిలోని చాలా వరకు రహస్య పత్రాలు బయటపడ్డాయని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వ్యక్తి అన్ని రకాల పత్రాలు, ఈమెయిల్స్‌ను కచ్చితంగా నేషనల్‌ ఆర్కైవ్స్‌కు తరలించాలి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆ పత్రాలను ఏమైనా దుర్వినియోగం చేశారా..? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ట్రంప్‌ మాత్రం అవి డీక్లాసిఫైడ్‌ పత్రాలు అని వాదిస్తున్నారు.

జనవరిలో ట్రంప్‌ మార్‌ ఎ లాగో ఎస్టేట్‌ నుంచి 15 పెట్టెల పత్రాలను నేషనల్‌ ఆర్కైవ్స్‌ స్వాధీనం చేసుకొంది. ఇవి ట్రంప్‌ పాలన చివరి రోజుల్లో ఆయన వద్దకు వచ్చినవి అయి ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని పత్రాలను ట్రంప్‌ చించేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. ఆ తర్వాత నేషనల్‌ ఆర్కైవ్స్‌.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ జస్టిస్‌ను ఆశ్రయించింది. ఏప్రిల్‌లో ఎఫ్‌బీఐ ప్రాథమిక దర్యాప్తును చేపట్టింది. ఆ తర్వాత ఆగస్టులో నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్‌బీఐ మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను తరలించింది.

ఇవీ చదవండి : ఫైనల్‌కు చేరిన బ్రిటన్‌ ప్రధాని రేసు.. పగలు, రాత్రి పనిచేస్తానన్న సునాక్‌

అమెజాన్​ అడవుల్లోని ఆ ఒక్కడు ఇకలేడు.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details