Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం కోలుకోవడానికి సాధ్యంకానంత క్లిష్టంగా మారిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో యూఏఈలోని ఆసుపత్రిలో ఉన్న ఆయన్ను పాక్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ అంబులెన్స్‌లో ఆయనను తరలించే అవకాశం ఉందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ముషారఫ్ కుటుంబం కోరుకుంటే ఆయన్ను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు పాక్ ఆర్మీ వీలు కల్పిస్తుందని పేర్కొంది. అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట ఆయన్ను పాకిస్థాన్‌కు తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. పాక్ ఆర్మీ తన మాజీ చీఫ్‌కు అండగా నిలుస్తోంది. తన ఏర్పాట్లలో భాగంగా ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచింది’ అని టీవీ యాంకర్ కమ్రాన్ షాహిద్ ట్వీట్ చేశారు.
Musharraf: ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు ముషారఫ్ - పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం కోలుకోవడానికి సాధ్యంకానంత క్లిష్టంగా మారిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన్ను పాకిస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్ గత మూడు వారాలుగా యూఏఈలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇటీవల కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై లేరని.. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోవడానికి సాధ్యం కానంత క్లిష్టంగా మారిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయడంలేదన్నారు. ముషారఫ్ కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ముషారఫ్ వయస్సు 78 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సైన్యంలో చేరి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇదీ చదవండి:పవార్ చుట్టూ రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం- మమత భేటీపైనే అందరి దృష్టి