తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ విమానం ఆచూకీ లభ్యం.. మొత్తం 22 మంది ప్రయాణికులు మృతి - నేపాల్​ విమానం గల్లంతు

nepal plane crash: నేపాల్​లో గల్లంతైన విమానం ఆచూకీ సన్సోవారో సమీపంలో లభ్యమైంది. విమానం నుంచి 14 మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ వెల్లడించింది. అయితే విమానంలోని మొత్తం 22 మంది చనిపోయినట్లు నేపాల్​ మీడియా తెలిపింది.

nepal plane crash
సహాయక బృందాలు

By

Published : May 30, 2022, 8:51 AM IST

Updated : May 30, 2022, 12:05 PM IST

nepal plane crash: నేపాల్​లో 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. విమాన శకలాల నుంచి 14 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సన్సోవారో సమీపంలో విమాన శకలాలను సహాయక బృందాలు గుర్తించాయి. చిన్న హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఆదివారం విమానం కూలిందని భావించిన ప్రదేశంలో మంచు కురిసిన కారణంగా.. శోధన, సహాయక చర్యలను నిలిపివేశారు. సోమవారం తిరిగి ప్రారంభించి శకలాలను గుర్తించారు. అయితే విమానంలోని ఏ ఒక్కరూ బతకలేదని, మొత్తం 22 మంది చనిపోయారని నేపాల్ మీడియా తెలిపింది.

నేపాల్​ తారా ఎయిర్​లైన్స్​కు చెందిన 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. గల్లంతైన వారిలో నలుగురు భారతీయులు కాగా వీరిని ముంబయికి చెందిన అశోక్​ కుమార్​ త్రిపాఠి, అతడి భార్య వైభవి బండేకర్​, పిల్లలు ధనుశ్​, రితికగా గుర్తించారు. వీరితో పాటు ముగ్గురు జపనీయులు సహా మొత్తం 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్​ వెళ్తుండగా విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో లేటే ప్రాంతానికి చేరుకున్న అనంతరం.. విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:భారీ పేలుడు శబ్దం..​ విమానం మాయం.. 22 మంది పరిస్థితి?

Last Updated : May 30, 2022, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details