తెలంగాణ

telangana

ETV Bharat / international

బూస్టర్​తో ఒమిక్రాన్​ సబ్​వేరియంట్ల నుంచి రక్షణ

Covid Omicron Variant: ఒమిక్రాన్, దాని సబ్‌-వేరియంట్ల నుంచి.. బూస్టర్‌ డోసులు విస్తృత, సమర్థ రక్షణ కల్పిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు.

By

Published : May 21, 2022, 8:02 AM IST

covid omicron variant
covid omicron variant

Covid Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్‌ కేసులు నమోదవుతుండటానికి ప్రధాన కారణమైన ఒమిక్రాన్, దాని సబ్‌-వేరియంట్ల నుంచి.. బూస్టర్‌ డోసులు విస్తృత, సమర్థ రక్షణ కల్పిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. ఆసుపత్రుల్లో చేరిన పలువురు కొవిడ్‌ బాధితుల నుంచి వారు రక్త నమూనాలు సేకరించి, యాంటీబాడీల స్థాయులను విశ్లేషించారు. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ రెండు డోసులతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు.. ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంట్‌ అయిన 'బీఏ.3'ను మాత్రమే సమర్థంగా నియంత్రిస్తున్నట్టు గుర్తించారు.

ఇతర సబ్‌-వేరియంట్లయిన బీఏ.1, బీఏ.1.1, బీఏ.2లతో పాటు, డెల్టా-ఒమిక్రాన్‌ వైరస్‌ల జన్యు సమ్మేళనాలతో ఉద్భవించిన డెల్టాక్రాన్‌కు వ్యతిరేకంగా.. బూస్టర్‌ డోసు మాత్రమే విస్తృత, సమర్థ రక్షణ కల్పించగలదన్న అభిప్రాయానికి వచ్చారు. బూస్టర్‌ డోసుతో ఏ వేరియంట్‌ నుంచైనా రక్షణ లభిస్తుందని ప్రధాన పరిశోధనకర్త, వైరాలజీ నిపుణుడు షాన్‌-లు లియూ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ సోకినవారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల కన్నా.. బూస్టర్‌ డోసు ద్వారా ఉద్భవించే ప్రతి నిరోధకాలే వివిధ వేరియంట్ల నుంచి అధిక రక్షణ కల్పిస్తున్నట్టు మరో పరిశోధనకర్త జాన్‌ ఇవాన్స్‌ తెలిపారు. న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్, సెల్‌ హోస్ట్‌ అండ్‌ మైక్రోబ్‌ పత్రికలు ఈ పరిశోధన ఫలితాలను ప్రముఖంగా ప్రచురించాయి.

ఇదీ చదవండి:ఆ వైరస్​తో ఒకే ఏడాదిలో లక్ష మంది చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details