తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాతో కోటిన్నర మంది మృతి'.. డబ్ల్యూహెచ్​ఓ నివేదికపై భారత్​ అసంతృప్తి! - డబ్ల్యూహెచ్​ఓ

Corona deaths worldwide: గత రెండేళ్లుగా మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సుమారు కోటిన్నర మందిని బలిగొంది. కొవిడ్‌ బారిన పడటం సహా ఆరోగ్య రంగంపై ప్రభావం కారణంగా 2020 జనవరి నుంచి గతేడాది ఆఖరి వరకూ కోటిన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని పేర్కొంది.

Corona deaths worldwide
కరోనా మరణాలు

By

Published : May 5, 2022, 8:03 PM IST

Corona deaths worldwide: కరోనా వైరస్ లేదా ఆరోగ్య రంగంపై కొవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత రెండేళ్ల కాలంలో కోటిన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ అంచనా వేసింది. జనవరి 2020 నుంచి 2021 డిసెంబర్​ వరకూ కొవిడ్ వలన లేదా ఆరోగ్య రంగంపై కరోనా ప్రభావం కారణంగా 1.33 కోట్ల నుంచి 1.66 కోట్ల మంది వరకూ మరణించి ఉండొచ్చని.. డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు అంచనావేశారు. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండుకోవటంతో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు చికిత్సకు దూరమైనట్లు పేర్కొంది.

వివిధ దేశాల ప్రభుత్వాలు అందించిన సమాచారం, జాన్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు సహా స్టాటిస్టికల్ మోడలింగ్ ద్వారా డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తలు కోటిన్నర మరణాలు సంభవించి ఉండొచ్చని అంచనా వేశారు. దేశాల సమాచారం, జాన్‌ హాప్ కిన్స్ యూనివర్సిటీ లెక్కలు, కొవిడ్ కారణంగా 60 లక్షల మంది చనిపోయినట్లు వెల్లడిస్తుండగా దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని డబ్ల్యూహెచ్​ఓ అంచనా వేసింది. ఆగ్నేయ ఆసియా, ఐరోపా, అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని పేర్కొంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి మహమ్మారులు తలెత్తితే ఎలా ఎదుర్కొవాలనే విషయంలో ఉపయోగపడతాయని పేర్కొంది.

మెర్స్ విజృంభణ తర్వాత దక్షిణ కొరియా ప్రజా ఆరోగ్య రంగంలో అధిక పెట్టుబడులు పెట్టిందన్న డబ్ల్యూహెచ్​ఓ.. ఫలితంగా దక్షిణ కొరియా తలసరి మరణాల రేటు అమెరికా తలసరి మరణాల రేటులో 20వ వంతు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి మహమ్మారులు తలెత్తితే ఎదుర్కొనేలా తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటంపై దేశాలు దృష్టి సారించాలని సూచించింది.

భారత్​ అసంతృప్తి: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించిన మ్యాథెమెటికల్​ మోడల్స్​పై అసంతృప్తి వ్యక్తి చేసింది భారత్​. అధికారిక లెక్కలకు మించి మరణాలు నమోదైనట్లు చూపించటం సరికాదని, అనుసరించిన విధానాల చెల్లుబాటు, డేటా సేకరణ ప్రక్రియ ప్రశ్నార్థకమని విమర్శించింది. తాజాగా విడుదల చేసిన డేటా, అనుసరించిన విధానాల విషయాన్ని ఆరోగ్య సంస్థ అసెంబ్లీ సహా సంబంధిత వేదికలపై లేవనెత్తనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియను భారత్​ తీవ్రంగా వ్యతిరేస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్​ ఉప వేరియంట్లతో ప్రమాదమే.. టీకానే శ్రీరామరక్ష'

'కొవిడ్.. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఇంకా తెలియడంలేదు'

ABOUT THE AUTHOR

...view details