తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2022, 12:32 PM IST

ETV Bharat / international

'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!

Cop 27 Rishi Sunak : పర్యావరణ సదస్సులో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అర్థాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటికెళ్లిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

cop27 event rishi sunak viral video
cop27 event rishi sunak viral video

Cop 27 Rishi Sunak : ఈజిప్టు వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు 'కాప్‌ -27' నుంచి బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. దీంతో ఏం జరిగిందా? అని అక్కడున్న సభ్యులంతా గందరగోళానికి గురయ్యారు. సమావేశ గది నుంచి రిషి హడావుడిగా బయటికెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

యూకేకు చెందిన కార్బన్‌ బ్రీఫ్‌ అనే మీడియా వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ లియో హికమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశారు. "కాప్‌-27 సదస్సులో బాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారు" అని హికమన్‌ ట్వీట్‌ చేశారు. "బ్రిటన్‌ ప్రధాని వేదికపై కూర్చుని ఉండగా.. ఆయన సిబ్బంది ఒకరు వచ్చి సునాక్‌ చెవిలో ఏదో చెప్పారు. దాని గురించి వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. అప్పటికీ రిషి అలాగే కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటికి మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారు" అని హికమన్ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇది జరిగిన రెండు నిమిషాలకే రిషి వేదికపై నుంచి దిగి తన సిబ్బందితో కలిసి హడావుడిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే రిషి చెవిలో సిబ్బంది ఏం చెప్పారు? ఆయన అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారు? అన్నది తెలియరాలేదు. బ్రిటన్‌ ప్రధాని అర్ధాంతరంగా బయటకు వెళ్లడంతో అక్కడున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. గత ఆదివారం కాప్‌-27 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు తొలుత రిషి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని సమావేశాల్లో పాల్గొని పర్యావరణ మార్పులపై ప్రసంగించారు.

ఇవీ చవదండి :'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

సరస్సులో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details