cooking oil price in Pakistan: పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో దాయాది పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోంది. ధరల పెరుగుదలతో శ్రీలంక పరిస్థితిని తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె, నెయ్యి ధరలను ఒకేసారి వరుసగా లీటరుకు రూ.213, రూ.208 పెంచింది. దీంతో నెయ్యి లీటర్కు రూ.555, వంట నూనె రూ.605కు చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ధరల పెంపును యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్(యూఎస్సీ) ధ్రువీకరించిందని, పెరిగిన కొత్త ధరలు జూన్ 1 బుధవారమే అమలులోకి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఒకేసారి ఈ స్థాయిలో ధరల పెంపు ఎందుకు చేపట్టారనే దానిపై సంబంధిత మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది.
ధరల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ వనస్పతి తయారీ సంఘం(పీవీఎంఏ) సెక్రెటరీ జనరల్ ఉమర్ ఇస్లామ్ ఖాన్. వంట నూనెల రిటైల్ ధరలు త్వరలోనే యూఎస్సీ స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నెయ్యి, వంట నూనెలను తయారీ దారులు యూఎస్సీకి అప్పుగా ఇవ్వటం ఆపేశారు. వారికి సుమారు రూ.2-3 బిలియన్లు చెల్లించాల్సి ఉంది. పామ్ ఆయిల్ సరఫరాపై ఏర్పాటైన ప్రధాని టాస్క్ఫోర్స్ కమిటీ ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో పామ్ఆయిల్ డిమాండ్, సరఫరాలపై విశ్లేషించింది.' అని తేలిపారు.
వంట నూనెల్లో దేశీయ అవసరాలకు అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది పాకిస్థాన్. ఇండోనేసియా నుంచి 87శాతం, మలేసియా నుంచి 13 శాతం వంట నూనెలు దిగుమతి అవుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. పీవీఎంఏ సెక్రెటరీ ప్రకారం.. కరాచీలో ప్రస్తుతం 1,60,000 టన్నుల పామ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అవి మరో మూడు వారాలకు సరిపోతాయి.
మరోవైపు.. దేశంలో గోధుమ పిండి ధర కిలోకు రూ.65కు చేరింది. గ్యాస్ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ ధరల పెరుగుదలకు కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంగా చెబుతున్నప్పటికీ అంతకు ముందు నుంచే ధరలు ముండిపోతున్నాయి. ఈ తరుణంలో ధరలను తగ్గిస్తామని ఇటీవల ప్రధానిగా బాధ్యలు చేపట్టిన షెహ్బాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. తన దుస్తులు విక్రయించైనా సరే.. ధరలు తగ్గిస్తానంటూ వ్యాఖ్యానించారు.
వస్తువు | ప్రస్తుత ధర (రూ.) | పెరిగిన ధర (రూ.) |