తెలంగాణ

telangana

ETV Bharat / international

మళ్లీ లారీ ఎక్కిన రాహుల్​ గాంధీ.. ఈసారి అమెరికాలో 190కి.మీ జర్నీ - రాహుల్​ గాంధీ తాజా వార్తలు

Rahul Gandhi Truck : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ట్రక్కులో ప్రయాణించారు. ఈసారి అమెరికాలో ఈ పర్యటన చేపట్టారు. అక్కడ నివసిస్తున్న భారత్​కు చెందిన ట్రక్కు డ్రైవర్​ల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలిసి ప్రయాణం చేశారు.

Rahul US Truck Ride
మళ్లీ లారీ ఎక్కిన రాహుల్​ గాంధీ.. ఈసారి అమెరికాలో 190కి.మీ జర్నీ

By

Published : Jun 13, 2023, 5:57 PM IST

Updated : Jun 13, 2023, 6:14 PM IST

Rahul Gandhi Truck Ride : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మళ్లీ లారీ ఎక్కారు. ఈసారి ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ ప్రయాణాన్ని చేపట్టారు. అక్కడ జీవనం కోసం వెళ్లిన భారత సంతతికి చెందిన కొందరు ట్రక్కు డ్రైవర్​ల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా వారితో కలిసి ప్రయాణం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్​ నుంచి న్యూయార్క్​ నగరం వరకు ఈ ట్రక్కు ప్రయాణం కొనసాగింది.

కొద్దిరోజుల క్రితమే దిల్లీ నుంచి చండీగఢ్​ వెళ్లే ఓ ట్రక్కు డ్రైవర్​ వాహనంలో కూడా రాహుల్​ గాంధీ ఎక్కి ప్రయాణించారు. హిమాచల్ ప్రదేశ్​లోని శిమ్లాకు వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యంలో ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓ దాబా వద్ద డ్రైవర్లతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు రాహుల్​. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

190 కి.మీల ప్రయాణం.. ఆపై వారితో కలిసి భోజనం!
Rahul Gandhi Truck Drive: భారత్​ సహా విదేశాల్లో సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాహుల్​ తన యాత్రను కొనసాగిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా తల్జీందర్ సింగ్ విక్కీ గిల్, అతడి సహచరుడు రంజీత్ సింగ్ బనిపాల్‌ కలిసి వెళ్తున్న ట్రక్కులో రాహుల్​ వాషింగ్టన్​ నుంచి న్యూయార్క్​ వరకు సుమారు 190 కిలోమీటర్లు ప్రయాణించారని.. ప్రయాణం ముగింపు అనంతరం డ్రైవర్​లతో కలిసి ఆయన భోజనం చేశారని కాంగ్రెస్​ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ వీడియోను రాహుల్ తన యూట్యూబ్ ఛానల్​లో పోస్ట్ చేశారు.

Rahul Gandhi Truck Drive : ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో అమెరికాలోని ట్రక్కులను ఇక్కడి డ్రైవర్​ల భద్రత సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారని.. ఈ సౌలభ్యం భారత్​లో లేదని రాహుల్​ పేర్కొన్నారు. మన దేశంలో డ్రైవర్​లు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తారని, దీంతో నిత్యావసరాల ధరల పెరుగుదల వారికి భారంగా మారుతుందని.. కానీ, అమెరికాలో ఆ పరిస్థితి ఉండదని.. ఇక్కడి ట్రక్కు డ్రైవర్​లు గౌరవప్రదమైన వేతనాలతో పాటు గౌరవం కూడా పొందుతారని రాహుల్​ అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో పెరుగుతున్న వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, రాజకీయాలపై ట్రక్కు డ్రైవర్​ తల్జీందర్ సింగ్, విక్కీ గిల్​తో చర్చించారు రాహుల్​ గాంధీ. ద్వేషాన్ని వ్యాప్తి చేయమని ఏ మతమూ బోధించదని గాంధీ గిల్​తో అన్నారు. ప్రయాణంలో భాగంగా రాహుల్​ సిద్ధూ మూసేవాలా పాటలను కూడా విన్నారు.

"భారతదేశంలోని ట్రక్కులు లేదా లారీల పరిశ్రమ కోసం కొత్త విజన్‌ను ప్లాన్ చేయడానికి అమెరికన్ ట్రక్ పరిశ్రమ నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మన రవాణా వ్యవస్థకు భారతీయ ట్రక్ డ్రైవర్లు జీవనాధారం అలాగే గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించేందుకు వీరు అర్హులు" అని కాంగ్రెస్​ పార్టీ ప్రకటనలో పేర్కొంది.

Last Updated : Jun 13, 2023, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details