తెలంగాణ

telangana

ETV Bharat / international

నివాస ప్రాంతంలో కూలిన విమానం.. 8 మంది మృతి.. ఏడు ఇళ్లు ధ్వంసం - Small plane crashes building Colombia

నివాస ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

COLOMBIA-AIRPLANE-CRASH
COLOMBIA-AIRPLANE-CRASH

By

Published : Nov 22, 2022, 12:20 PM IST

కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మెడెలిన్ నగరంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒలాయా హెరెరా ఎయిర్​పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలిందని కొలంబియా విమానయాన అధికారులు వెల్లడించారు.

విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం

మృతుల్లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయం తెలియలేదు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో పేర్కొన్నారు. నగరంలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలిందని చెప్పారు. 'ఏడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరో ఆరు భవనాలు దెబ్బతిన్నాయి' అని వివరించారు.

సహాయక చర్యలు
.

ABOUT THE AUTHOR

...view details