తెలంగాణ

telangana

ETV Bharat / international

బొగ్గుగనిలో భారీ పేలుడు.. 40 మంది దుర్మరణం.. 110 మందికి గాయాలు - బొగ్గుగనిలో పేలుడు

బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. తుర్కియేలో జరిగిన ఈ దుర్ఘటనలో 40 మంది కార్మికులు మృతిచెందగా.. 110 మందికిపై గాయపడ్డారు.

turkey coal mine explosion
explosion in coal mine

By

Published : Oct 15, 2022, 7:01 AM IST

Updated : Oct 15, 2022, 3:54 PM IST

తుర్కియేలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు మంది మృతిచెందగా.. 110 మందికి పైగా గాయపడ్డారు. మైన్​లో చిక్కుకున్న మిగతా క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు. గనుల్లో పేలుడుకు తోడ్పడే వాయువులు ఉన్నందున ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గనిలో 110 మంది కార్మికులు ఉండగా వారిలో చాలా మందికి ఇప్పటికే బయటకి తీసుకొచ్చామని రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొన్న​ అధికారి సులేమాన్​ సోయ్​లు తెలిపారు. మరో 49 మంది ప్రమాదకరమైన ప్రదేశంలో చిక్కుకుని ఉన్నారని.. వారిని వీలైనంత త్వరగా రక్షిస్తామని చెప్పారు.​ గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

Last Updated : Oct 15, 2022, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details