న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్(44) ప్రమాణ స్వీకారం చేశారు. గత వారం ఎవరూ ఉహించని విధంగా జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేయడం వల్ల క్రిస్.. న్యూజిల్యాండ్ 41వ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. కొద్దిమంది స్నేహితులు, సహోద్యోగుల సమక్షంలో హిప్‌కిన్స్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. న్యూజిల్యాండ్‌లో కొవిడ్ మహమ్మరి ప్రతిస్పందన రూపుశిల్పిగా పేరుపొందిన క్రిస్ అక్టోబర్‌లో జగరబోయే సాధారణ ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగనున్నారు. కొంతకాలంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని హిప్ కిన్స్ హామీ ఇచ్చారు.
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ప్రమాణం - క్రిస్ హిప్ కిన్స్ లేటెస్ట్ న్యూస్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిమంది స్నేహితులు, సహోద్యోగుల సమక్షంలో కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
జెసిండా స్థానంలో పోటీలో క్రిస్ ఒక్కరే ఉండటం వల్ల లేబర్ పార్టీలో సభ్యుల ఆమోదం లాంఛనమైంది. ప్రధాని స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవటం వల్ల చట్ట సభ్యులు హిప్కిన్స్ వైపే మొగ్గుచూపారు. కరోనా వైరస్ ఉద్ధతంగా ఉన్న సమయంలో క్రిస్ సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. కొత్త శైలి నాయకత్వానికి ఐకాన్‌గా గుర్తింపు పొందిన జెసిండా ఆర్డెర్న్ నీడలో ఇంతకాలం ఉన్నందున ఆయన పేరు బయటకు రాలేదు. ఆయన ఇంతకు ముందు విద్యాశాఖతో పాటు, పోలీసు, పబ్లిక్ సర్వీస్ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు వెళ్లొచ్చు అనే వ్యాఖ్యలతో ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
TAGGED:
Chris Hipkins latest news