China daily Covid cases: కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో... వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత కొన్నిరోజులుగా వైరస్ వ్యాప్తి భారీగా పెరుగుతుండగా... బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయి పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ నేషనల్ హెల్త్ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. చైనాలో బుధవారం ఒక్కరోజే 31,454 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి అని డ్రాగన్ అధికారులు వెల్లడించారు.
చైనాలో కరోనా ఉగ్రరూపం.. ఎన్నడూ లేని స్థాయిలో రోజువారీ కేసులు - చైనాలో వైరస్ కరాళ నృత్యం
చైనాను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఇప్పటికే వైరస్ కట్టడికి జీరో కొవిడ్ విధానం అమలు చేస్తున్న చైనా... ఇటీవల వెలుగుచూస్తున్న కేసులతో మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ... డ్రాగన్ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు విధించడం... భారీగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం చేస్తోంది.
ఇదీ చదవండి:చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం