తెలంగాణ

telangana

ETV Bharat / international

తైవాన్​పై చైనా దూకుడు.. 71 యుద్ధ విమానాలను పంపిన డ్రాగన్​ - అమెరికా తైవాన్​ సంబంధాలు

తైవాన్​కు అమెరికా మద్దతుగా నిలిస్తున్నందున చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా తమ గగన తలంలోకి 71 యుద్ధ విమానాలను పంపిందని తైవాన్​ ఆరోపించింది.

chinas military
చైనా తైవాన్​ వివాదం

By

Published : Dec 26, 2022, 12:16 PM IST

Updated : Dec 26, 2022, 12:42 PM IST

China Taiwan Issue : తైవాన్‌ విషయంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తమ గగనతలంలోకి 71 యుద్ధ విమానాలను చైనా పంపిందని.. తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. 7 డాగ్రన్‌ యుద్ధనౌకలు సైతం తమ జలాల్లోకి ప్రవేశించాయని మండిపడింది. శనివారం అగ్రరాజ్యం అమెరికా తన వార్షిక రక్షణ బిల్లును ఆమోదించగా.. అందులో తైవాన్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దీనిపై ఆగ్రహంగా ఉన్న చైనా.. ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తైవాన్‌ తెలిపింది.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య.. 47 చైనీస్ విమానాలు తైవాన్ జలసంధిలో ప్రయాణించినట్లు ఆ దేశ రక్షణశాఖ స్పష్టం చేసింది. చైనా పంపిన విమానాల్లో, 18 జే-16 ఫైటర్‌ జెట్లు, 11 జే-1 ఫైటర్లు, 6 సుఖొయి 30 ఫైటర్లు ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం భూ ఆధారిత క్షిపణి వ్యవస్థలు, యుద్ధనౌకల ద్వారా చైనా కదలికలను గమనిస్తున్నట్లు తైవాన్‌ పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన చైనా.. తైవాన్ చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాలు, గగనతలంలో స్ట్రైక్ డ్రిల్స్ నిర్వహించినట్లు స్పష్టంచేసింది. తైవాన్, అమెరికా రెచ్చగొట్టే చర్యల కారణంగా ఈ కసరత్తులు జరిగాయని చైనా పేర్కొంది.

Last Updated : Dec 26, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details