అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి తన దుర్నీతిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్.. చైనాలో అంతర్భాగమని పేర్కొంది. తమ భూభాగంలోనే అరుణాచల్ ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అందుకే అరుణాచల్‌లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టిందని ఆమె చెప్పారు.
'జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగంలో ఉంది. జాంగ్నాన్పై సార్వభౌమాధికారం చైనాదే. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక నిబంధనల ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టాం.' అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా పేర్లు మార్చడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో అంతర్భాగమని అమెరికా గుర్తించిందని వెల్లడించింది.
అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్..
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంపై మంగళవారం.. భారత్ తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారవని స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడటం చైనాకు కొత్త కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది.