తెలంగాణ

telangana

ETV Bharat / international

'తక్షణమే బకాయిలు చెల్లించండి లేదంటే..'- పాక్​కు చైనా కంపెనీల హెచ్చరిక - పాకిస్థాన్

CPEC Corridor: పాకిస్థాన్‌ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీచేశాయి పలు చైనా కంపెనీలు. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా చేపట్టిన పనులకు గానూ రూ.30 వేల కోట్లను వెంటనే చెల్లించాలని స్పష్టంచేశాయి. బకాయిలు చెల్లించకపోతే పాకిస్థాన్‌లో కంపెనీలను మూసేస్తామని హెచ్చరించాయి.

cpec news pakistan
cpec corridor news

By

Published : May 10, 2022, 10:21 PM IST

CPEC Corridor: పలు చైనా కంపెనీలు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీచేశాయి. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)లో భాగంగా చేపట్టిన పనులకు రూ. 30వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశాయి. చెల్లించని పక్షంలో పాకిస్థాన్ తమ కంపెనీలను మూసివేస్తామని తేల్చిచెప్పాయి. ఈ మేరకు ఆ దేశ ప్రణాళికా శాఖ మంత్రి అషామ్​ ఇక్బాల్​తో జరిగిన సమావేశంలో పేర్కొన్నాయి.

సీపీఈసీలో భాగంగా.. 30 చైనా కంపెనీలు విద్యుత్‌, కమ్యూనికేషన్లు, రైల్వేలు, రహదారులు, ఇతర రంగాల్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాయి. వాటికి సంబంధించి.. రూ. 30వేల కోట్ల మేర తమకు బకాయిలు ఉన్నట్లు.. మంత్రి అషామ్‌ ఇక్బాల్‌తో జరిగిన సమావేశంలో వివరించారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించకపోతే.. కంపెనీలను మూసివేస్తామని 25 సంస్థల ప్రతినిధులు మంత్రికి స్పష్టం చేశారు. అయితే.. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దృష్టిసారించారని.. నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:CPEC Project News: డ్రాగన్‌ కలల ప్రాజెక్టు 'సీపెక్'​కు తప్పని చిక్కులు..

ABOUT THE AUTHOR

...view details