China corona lockdown: కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా భావించే చైనాలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 1,219 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ విజృంభనను కట్టడి చేయడానికి చైనాలోని అతిపెద్ద నగరం అయిన షాంఘైలో ఐదు రోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరి అయితేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి వీళ్లేదని ఆదేశించారు.
అక్కడ మళ్లీ కరోనా విజృంభణ.. అతిపెద్ద నగరంలో లాక్‌డౌన్ - షాంఘై లాక్‌డౌన్
China Lockdown: కొవిడ్ విజృంభనను కట్టడి చేయడానికి చైనాలోని అతిపెద్ద నగరం అయిన షాంఘైలో ఐదు రోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇది కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి వీళ్లేదని ఆదేశించారు.
అత్యవసరాలు మినహా మిగతా కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలులో ఉంది. షాంఘైలోని డిస్నీ థీమ్ పార్క్‌ను సైతం ఇప్పటికే మూసివేశారు. గడిచిన నెలలో చైనాలో 56 వేల కేసులు నమోదయ్యాయి. . చైనాలో టీకా పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా.. వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని చైనా జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి:యుద్ధ రంగంలోకి బెలారస్.. రష్యాతో కలిసి ఉక్రెయిన్‌పై దాడులు..!