తమ దేశంలో పనిచేసే భారత వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు తీపికబురు చెప్పింది చైనా. కరోనా కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వారికి వీసాలను అందించనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటే చైనా యూనివర్సిటీల్లో చదివే భారతీయ విద్యార్థులు తిరిగి తమ దేశానికి వచ్చేందుకు అనుమతించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.
భారత నిపుణులు, విద్యార్థులకు చైనా తీపికబురు.. వీసాలకు ఓకే!
చైనాలో పనిచేసి వృత్తినిపుణులు, విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. కరోనా కారణంగా ఆ దేశంలో కఠిన వీసా ఆంక్షల అమలు నేపథ్యంలో రెండేళ్లుగా.. భారత్లోనే చిక్కుకుపోయినవారికి చైనాకు తిరిగొచ్చేందుకు వీసాలను అందించనున్నట్లు బీజింగ్ ప్రకటించింది.
china visa open for india 2022
ఈ మేరకు దాదాపు రెండేళ్ల తర్వాత కొవిడ్-19 వీసా విధానాన్ని సోమవారం అప్డేట్ చేసింది భారత్లోని చైనా రాయబార కార్యాలయం. తమ దేశంలో పనిచేసే అన్ని రంగాల్లోని విదేశీయులు, వారి కుటుంబసభ్యులు తిరిగి చైనా వచ్చేందుకు వీసా దరఖాస్తులను ఆమోదించనుంది. దీంతో 2020 నుంచి భారత్లోనే చిక్కుకుపోయిన వందలాది మంది భారత వృత్తి నిపుణులకు ఉపశమనం దక్కనుంది.
ఇదీ చూడండి:క్వారంటైన్ నుంచి 50రోజులకు రిలీజ్.. కానీ చుట్టూ కంచె వేసి...