తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. శిథిలాల కింద 23 మంది!

China building collapse: చైనా హునాన్​ ప్రావిన్స్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల్లో 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

BUILDING-COLLAPSE
కుప్పకూలిన ఆరు అంతస్థుల భవనం

By

Published : Apr 30, 2022, 6:58 PM IST

China building collapse: ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన చైనా, సెంట్రల్​ హునాన్​ ప్రావిన్స్​లో జరిగింది. శిథిలాల్లో 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ అధికారులను ఆదేశించారు.

వాంగ్​చెంగ్​ జిల్లాలోని చాంగ్షా నగరంలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో ఉన్న భవనం.. శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలిందని చైనా అధికారిక మీడియా చైనా గ్లోబల్​ టెలివిజన్​ నెట్​వర్క్​ తెలిపింది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని, సుమారు 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ లేదని పేర్కొంది.

"కూలిపోయిన భవనం యజమానిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్రమ, అనుమతులు లేని భవనాల నిర్మాణాలు, పాత భవనాల ఆకృతిని మార్చటం వంటివి చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించాం."

- హాంగ్​ మింగ్​, అత్యవసర నిర్వహణ మంత్రి

శనివారం ఉదయం.. చైనా కౌన్సిలర్​ వాంగ్​ యోంగ్​ చాంగ్షాను సందర్శించారు. సహాయక, అత్యవసర చర్యలను పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి:'ముందుగా మేమే దాడి చేస్తాం'.. మరోసారి కిమ్ అణు బెదిరింపులు

భారత విద్యార్థులకు చైనా తీపి కబురు.. కొందరికి అనుమతి!

ABOUT THE AUTHOR

...view details