తెలంగాణ

telangana

ETV Bharat / international

'క్యాపిటల్​ హిల్​పై దాడి.. అగ్గిరాజేసింది ట్రంపే' - డొనాల్డ్‌ ట్రంప్

గతేడాది క్యాపిటల్​ హిల్​పై జరిగిన దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగదోశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్న కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ సభ్యురాలు లిజ్‌ ఛెనీ ఈమేరకు పేర్కొన్నారు. అయితే ఈ విచారణ మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్‌ కొట్టిపారేశారు.

capitol riot news
donald trump news

By

Published : Jun 10, 2022, 7:47 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తిరుగుబాటుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టింది. విచారణ కమిటీకి రిపబ్లికన్‌ పార్టీకి చెందిన లిజ్‌ ఛెనీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ 'దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలను ట్రంప్‌ ఎగదోశారు' అని పేర్కొన్నారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు బెన్నీ థాంప్సన్‌ మాట్లాడుతూ ట్రంప్‌ అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు.

గతేడాది 2021 జనవరి 6న జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికా చట్ట సభ సభ్యులు క్యాపిటల్‌ హిల్‌ భవనంలో సమావేశం అయ్యారు. అదే సమయంలో ట్రంప్‌ మద్దతుదారులు ఈ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం ఏడాది పాటు దర్యాప్తు నిర్వహించింది. ట్రంప్‌ సన్నిహితులతో నిర్వహించిన ఇంటర్వ్యూ క్లిప్‌లను గురువారం సాయంత్రం నుంచి డెమొక్రాట్లు నేతృత్వం వహిస్తున్న ప్రతినిధుల సభ సెలక్ట్‌ కమిటీ ప్రదర్శిస్తోంది.

ఆ ఫుటేజీల్లో.. అమెరికా మాజీ అటార్నీ జనరల్‌ బిల్‌బార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయారని, ఫలితాలను అపహరించారనే మాటలు అవాస్తవాలని పదేపదే నాటి అధ్యక్షుడు ట్రంప్‌ను వారించానన్నారు. ట్రంప్ వాదిస్తోన్న కుట్ర కోణాన్ని బిల్‌బార్‌ తోసి పుచ్చడాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా పేర్కొన్న దృశ్యాలు కాంగ్రెస్‌ వద్ద ఉన్న ఫుటేజీల్లో ఉన్నాయి. మరోపక్క ఈ విచారణలు మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్‌ కొట్టిపారేశారు.

ఇదీ చూడండి:'కుట్ర ప్రకారమే క్యాపిటల్​ దాడి- ట్రంప్​కు వ్యతిరేకంగా సాక్ష్యాలు!'

ABOUT THE AUTHOR

...view details