తెలంగాణ

telangana

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌​ ఆయుధాలు.. శిక్షణ ఇచ్చి మరీ.. అమెరికా బాటలోనే!

By

Published : Jun 3, 2022, 7:25 AM IST

Ukriane Crisis: రష్యా సైనిక చర్యతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఉక్రెయిన్​కు ఆయుధాలు పంపిస్తామని బుధవారం.. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పుడు బ్రిటన్​ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఎం-270 లాంఛర్లను పెద్దసంఖ్యలో పంపిస్తామని, ఇవి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలనూ కచ్చితత్వంతో ఛేదించగలవని వివరించింది. దీనిని వాడడంలో ఉక్రెయిన్‌ సైనికులకు యూకేలో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది.

Ukriane Crisis:
Ukriane Crisis:

Ukriane Crisis: గత 99 రోజులుగా రష్యా చేస్తున్న దురాక్రమణ యత్నాలను తిప్పికొట్టడంలో ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని బ్రిటన్‌ కూడా నిర్ణయించింది. అధునాతన ఆయుధాలను, రాకెట్‌ వ్యవస్థలను సరఫరా చేయనున్నట్లు అమెరికా, జర్మనీ ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే యూకే కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. అపారమైన ఆయుధాలున్న రష్యాను నిలువరించాలంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఆయుధాలు కీలకం కావడం వల్ల ఆ మేరకు సాయం అందించనున్నట్లు తెలిపింది.

ఎం-270 లాంఛర్లను పెద్దసంఖ్యలో పంపిస్తామనీ, ఇవి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలనూ కచ్చితత్వంతో ఛేదించగలవని వివరించింది. దీనిని వాడడంలో ఉక్రెయిన్‌ సైనికులకు యూకేలో శిక్షణ ఇస్తామని తెలిపింది. కొద్దిపాటి తేడాలు మినహా అమెరికా, యూకే ఆయుధాలు ఒకేలా ఉంటాయి. ఉక్రెయిన్‌కు తమ దేశం నుంచి సెమీ ఆటోమేటిక్‌ రైఫిళ్లు, ట్యాంకు విధ్వంసక ఆయుధాలను విరాళంగా సరఫరా చేయనున్నట్లు స్వీడన్‌ ప్రకటించింది.

అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయి: క్రెమ్లిన్‌
పాశ్చాత్య దేశాలు సమకూరుస్తున్న ఆయుధాలను తమపైకి గురి పెడితే అవాంఛనీయ, అప్రియమైన పరిస్థితులు తలెత్తుతాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్‌కోవ్‌ హెచ్చరించారు. ఆయుధాలు గుమ్మరిస్తున్న దేశాల చేతిలో ఉక్రెయిన్‌ కీలుబొమ్మగా మారుతోందని, దానివల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం కలుగుతుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు దౌత్యపరమైన ఊపు లభించేలా ఆ దేశంలో తమ రాయబారిగా బ్రిడ్జెట్‌ బ్రింక్‌ను అమెరికా నియమించింది.

.

పాశ్చాత్య దేశాలతో సమన్వయం బాధ్యతను ఆమెకు అప్పగించారు. కాస్త విరామం లభించడంతో ఆయుధాలను, సైనికులను భర్తీ చేసేందుకు రష్యా ప్రయత్నించనుందని సైనిక రంగ విశ్లేషకుడు జడనోవ్‌ చెప్పారు. ఘర్షణలు, హింస, పీడనల వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ప్రజలు వలస వెళ్లారని, రెండో ప్రపంచయుద్ధ కాలం నాటి కంటే ఇది ఎక్కువని ఐరాస శరణార్థుల హైకమిషన్‌ తెలిపింది. ఒక్క ఉక్రెయిన్‌ నుంచే 66 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని వెల్లడించింది.

సీవీరోదొనెట్స్క్‌పై పట్టు బిగింపు
తూర్పు ప్రాంత నగరమైన సీవీరోదొనెట్స్క్‌ సహా పలు పట్టణాలు, నగరాలపై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సీవీరోదొనెట్స్క్‌లో సింహభాగాన్ని రష్యా చేజిక్కించుకుందనీ, లుహాన్స్క్‌ ప్రావిన్సులో ఒక నగరాన్ని కూడా గుప్పిట పట్టిందని యూకే రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లోని 20% భూభాగం 'ఆక్రమణదారుల' చేతిలో ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఒక్కరోజులోనే 15 క్షిపణుల్ని రష్యా తమపైకి ప్రయోగించిందని ఆరోపించారు. రష్యాకు బలవంతంగా తరలించినవారిలో దాదాపు 2 లక్షల మంది పిల్లలు ఉన్నారనీ, వారు ఉక్రెయిన్‌ గురించి మరచిపోయేలా చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలతో తమను జయించడం రష్యాకు అసాధ్యమన్నారు. లగ్జెంబర్గ్‌ పార్లమెంటును ఉద్దేశించి ఆయన వీడియో ద్వారా ప్రసంగించారు.

ఇవీ చదవండి:క్వీన్​ ఎలిజబెత్​-2 పాలనకు 70ఏళ్లు.. వైభవంగా ప్లాటినమ్​ జూబ్లీ వేడుకలు

టర్కీ దేశానికి కొత్త పేరు.. ఇక నుంచి ఎలా పిలవాలంటే?

ABOUT THE AUTHOR

...view details