తెలంగాణ

telangana

ETV Bharat / international

వైద్య చరిత్రలోనే అద్భుతం​.. గర్భంలో ఉన్న పిండానికి బ్రెయిన్ సర్జరీ! - కడుపులో ఉన్న శిశువుకు వైద్యుల బ్రెయిన్ సర్జరీ

అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్,​ బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్​ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఇంకా గర్భంలోనే ఉన్న ఓ పిండానికి.. బ్రెయిన్​ సర్జరీ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. తల్లి గర్భంలో 34 వారాల వయస్సున్న చిన్నారికి సర్జరీ చేసి రికార్డ్​ సృష్టించారు.

brain-surgery-on-unborn-child-by-boston-childrens-hospital-doctors-first-time-in-medical-history
గర్భంలో ఉన్న పిండానికి బ్రెయిన్ సర్జరీ

By

Published : May 5, 2023, 4:56 PM IST

ఇంకా గర్భంలోనే ఉన్న ఓ పిండానికి బ్రెయిన్​ సర్జరీ చేశారు వైద్యులు. తల్లి కడుపులోనే మెదడు నుంచి రక్తస్త్రావం జరుగుతున్న ఆ చిన్నారికి.. విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తల్లి గర్భంలో 34 వారాల వయస్సున్న చిన్నారికి సర్జరీ చేసి రికార్డ్​ సృష్టించారు. అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్,​ బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్​ వైద్యులు ఈ ఘనత సాధించారు.

చిన్నారి మెదడులో దాదాపు 14 మిల్లీమీటర్ల వెడల్పు ప్రాంతంలో రక్తస్త్రావం జరుగుతోంది. ఈ అరుదైన పరిస్థితిని "వీనస్ ఆఫ్ గాలెన్ మాల్​ఫార్మేషన్​"గా పిలుస్తారు. దీని కారణంగా బిడ్డ జన్మించిన తరువాత.. మెదడు దెబ్బతినడం, గుండె సమస్యలకు దారితీయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు వస్తాయి. వీనస్ ఆఫ్ గాలెన్ మాల్​ఫార్మేషన్​ సమస్యతో మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందదు. దీంతో రక్తం సిరలపై, గుండెపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది.

చిన్నారి తల్లి గర్భంలో 30 వారాల వయస్సు ఉన్నప్పుడు.. సాధారణ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ సమస్యను గుర్తించారు వైద్యులు. అనంతరం పాప పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో చిన్నారిని కాపాడేందుకు.. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్,​ బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్​ వైద్యులు ముందుకొచ్చారు. గర్భంలో పిండానికి వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు... సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. అనంతరం చిన్నారికి 34 వారాల వయస్సప్పుడు విజయంవంతంగా ఆపరేషన్​ పూర్తి చేశారు.

అల్ట్రాసౌండ్ గైడెన్స్ సహాయంతో, అమ్నియోసెంటెసిస్‌కు ఉపయోగించే సూదులు (గాయాల నుంచి పిండాన్ని రక్షించే ద్రవం నమూనాను తీసుకోవడానికి ఉపయోగించే ప్రక్రియ), రక్త ప్రవాహాన్ని ఆపేందుకు రక్త నాళాలలో నేరుగా అమర్చే చిన్న కాయిల్స్ వంటి వాటి సహాయంతో.. పిండానికి విజయవంతంగా చికిత్స చేయగలిగారు వైద్యులు. ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స విజయవంతం కావడం వల్ల.. పిండాలలో ఏర్పడే ఇతర సమస్యలకు కూడా ఇదే తరహాలో చికిత్స చేయవచ్చని వైద్యులు విశ్వసిస్తున్నారు.

గర్భిణీకి అరుదైన సర్జరీ.. కడుపులో నుంచి అరకిలో రాయి, ఆ తరువాత డెలివరీ..
ఇటీవల మధ్యప్రదేశ్ బుందేల్​ఖండ్​ వైద్య కళాశాలలోని డాక్టర్లు గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స చేశారు. గర్భాశయం నుంచి అరకిలో బరువున్న రాయిని బయటకు తీశారు. రాయి పొడవు 10 సెంటీమీటర్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత శిశువును సురక్షితంగా బయటకు తీశామన్నారు. ప్రసవం కోసం వచ్చిన ఆమెకు ఎలాంటి నొప్పులు రాకపోవడం, శిశువు ఎటూ కదలకపోవడం గమనించిన వైద్యులు.. పరీక్షలు నిర్వహించి కడుపులో రాయిని గుర్తించారు. అనంతరం విజయంవంతంగా ఆపరేషన్​ పూర్తి చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details