తెలంగాణ

telangana

ETV Bharat / international

Boris Apology : 'అది పార్టీ అని అనుకోలేదు.. క్షమించండి' - బోరిస్​ జాన్సన్​ న్యూస్​

Boris Johnson On Partygate: పార్టీగేట్​ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. నిబంధనలను ఉల్లఘించాలనేది తన ఉద్దేశం కాదని ఆయన పేర్కొన్నారు.

boris johnson party
Boris Johnson news

By

Published : Apr 20, 2022, 7:24 AM IST

Updated : Apr 20, 2022, 1:46 PM IST

Boris Johnson On Partygate: పార్టీగేట్​ వ్యవహారంపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ క్షమాపణలు తెలిపారు. నిబంధనలను ఉల్లఘించాలనేది తన ఉద్దేశం కాదని.. ఆ సమయంలో పలువురితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం పార్టీగా పరిగణిస్తారని తాను భావించలేదని పేర్కొన్నారు. ఆ ఘటనకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. ప్రధాని బోరిస్​ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో జాన్సన్​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"నా వైఖరి పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలుసు. ఆ రోజు కేబినెట్​ గదిలో కొవిడ్​ కట్టడి గురించి సమావేశం​ నిర్వహించడానికి కొద్దిసేపటికి ముందు పలువురితో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాను. అది నిబంధనలను అతిక్రమించినట్లు అవుతుందని నేను అనుకోలేదు."

-బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

'ఇదో జోక్​'..: బోరిస్​ క్షమాపణలు మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు లేవని.. ఇదో జోక్​లా ఉందని విమర్శించారు ప్రతిపక్ష నేత కీర్​ స్టార్మర్​. ప్రధాని వ్యాఖ్యలపై ఇతర ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీగేట్​ వ్యవహారంపై గతవారం బోరిస్​కు 50 పౌండ్ల జరిమానాను విధించింది స్థానిక కోర్టు. 2020 జూన్​లో దేశంలో కఠిన లాక్​డౌన్​ అమలు చేసిన సమయంలో నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘిస్తూ బోరిస్​ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వైఖరిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. బోరిస్​ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి:బ్రిటన్ ప్రధాని, భారత సంతతి మంత్రులపై రష్యా నిషేధం

Last Updated : Apr 20, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details