Boris Johnson Kyiv Tour: రష్యాతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలపడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీవ్‌కు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌కు సుదీర్ఘంగా మద్దతు తెలుపుతూ ఆర్థికంగా, ఆయుధపరంగా కొత్త ప్యాకేజీలను ప్రకటించారు. 130 మిలియన్ డాలర్ల సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన మరుసటి రోజే జాన్సన్ ఉక్రెయిన్‌లో పర్యటించడం గమనార్హం. జాన్సన్ కీవ్ పర్యటన ఇప్పుడే మొదలైందని.. ఆయన జెలెన్స్కీతో సమావేశం అయ్యారని ఉక్రెయిన్ అధ్యక్ష ప్రతినిధి ఆండ్రిజ్ సిబిహా తెలిపారు.
కీవ్‌లో బోరిస్ ఆకస్మిక పర్యటన.. ఆయుధాలిస్తామని జెలెన్స్కీకి హామీ - Boris Johnson News
Boris Johnson Kyiv Tour: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా తన దృష్టి సారిస్తోన్న వేళ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం ఆకస్మికంగా కీవ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ దీర్ఘకాలిక సహకారంతోపాటు మరింత ఆర్థిక, సైనిక సాయం అందిస్తుందని జాన్సన్ హామీ ఇచ్చారు.
బోరిస్ జాన్సన్
ఉక్రెయిన్ మిలిటరీకి మరిన్ని స్టార్‌స్ట్రీక్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, మరో 800 యాంటీ ట్యాంక్ క్షిపణులను అందిస్తామని శుక్రవారం జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో జరిగిన సమావేశంలోనూ జాన్సన్ తెలిపారు.